ఈ పుట అచ్చుదిద్దబడ్డది

138

గ ణ ప తి

కంటె నెక్కువగ లభించుటలేదు. ఒకరిని యాచించి యెరువు గుఱ్ఱమెక్కి రెండుమూఁడు గడియలు స్వారి వెడలుట గణపతికి లజ్జాకరముగనుండెను. సాధ్యమైనంతవఱకు సొంతవాహనముగాని నిరంతరము గ్రామమునందె యుండు వాహనముగాని సంపాదింప వలయునని యతఁడు సంకల్పించు కొనియెను. ఆశ్వములు మొదలైన వర్థజాధ్యములు, అర్థములేని గణపతివంటి వ్యర్థున కవి యెట్లు సాధ్యమగును? సాధ్యముకానిచో నుబలాటము తీరు టెట్లు? అశ్వారోహణమందలి యాత్సుక్యము దీర్చుకొనుటకై యతఁ డుపాయములు వెదకెను. గుఱ్ఱము లేనప్పుడు దానికి బదులుగా మనుష్యుఁ డెక్కి తిరుగుటకు వీలైనది మఱియొక జంతువు లేదా యని యతం డాలోచించెను. గాడిదె నేల యెక్కగూడదని యతఁడు విమర్శింపఁ దొడఁగెను. గాడిద నెక్కిన పక్షమున గలిగెడు లాభనష్టములేవి యని యత డిట్లు వితర్కించెను. "గుఱ్ఱమువలె దానికిగూడ నాలుగు కాళ్లున్నవిగదా, మనుష్యులను మోయగలదు గదా, కడుదూరము నడువ గలదు గదా, రూపమున భేదముతప్ప గుణములయందు భేదమేమియు గనఁబడదు. విశేషించి గుఱ్ఱమునకు గుగ్గెళ్ళు దాణా పెట్టవలెను. గాడిదెకు గుగ్గెళ్ళక్కఱలేదు. ఏ బీటిలో వదిలిపెట్టినను నే చేనిలో వదిలిపెట్టినను దా నంతటది మేత తినివచ్చును. గుఱ్ఱమున కొక సాల గావలెను. గాడిదె కక్కఱలేదు. ఏ చెట్టుక్రింద వదిలినను నేబైట దిరిగినను భయములేదు. గుఱ్ఱమును మాలీసు