ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

137

చుట్టకాల్చుట నిర్వికారముగ నలవా టగువఱకు నెవరినో యొకరి నడిగి యావస్తువులలో నేదోయొకటి తెచ్చి తాగి కష్టపడి యలవాటు చేసికొని దినమునకు నూరుచుట్టలు కాల్చినను వికారపెట్టనంతటి దిట్టయయి మిత్రవర్గములో నప్రతిష్టపాలు గాకుండ బొట్టివాఁడు గట్టివాడుఁరా యని పేరు వడసెను. గణపతి పూనికవంటి పూనిక దేశములో నెందరికి గలదు? ఎందరో తెలివితక్కువవాండ్రు చుట్టలు వికారపెట్టగానె యొక దండము పెట్టి మానవైచిరి కాని గణపతివలె దాని యంతము కనుగొనువారు కలరా? అందుచేతనె యతని చరిత్రము పురాణ మైనది.

చిన్ననాట నుండియు గుఱ్ఱమెక్కవలయునని గనపతి కుబలాటము గలిగెను. మందపల్లిలోను నేనుగుల మహలులోను గుఱ్ఱములే లేవు. అప్పుడప్పుడు దూరపు టూళ్ళ నుండి గాజుల వర్తకులు గుఱ్ఱములెక్కి తన యూరికి వచ్చినపుడు గణపతి వారికడ కరిగి వారిని బతిమాలి ఆవకాయముక్కయో మాగాయముక్కయో తల్లి జూడకుండ నింటనుండి పట్టుకొని నాలుగు చుట్టముక్కలు కొసరిచ్చి యొకసారి గుఱ్ఱముమీఁద నెక్కించమని వారిని వేడుకొని యెక్కి నాలుగు వీధులు దిరిగి తనకు గలిగిన యశ్వారోహణవైభవము తోడిసంగతికాండ్రకు గలుగనందుకు గర్వపడుచు మార్గమధ్యమున వారు కనఁబడినప్పుడు వెక్కిరించుచు నుబలాటము దీర్చుకొనుచుండును. ఈ యయిశ్వర్య మేడాదికి రెండుమూఁడు సారుల