ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

129

తప్పించుకొన వలయునని యుపాయములు వెదకుటతోడనే కాలము వెళ్ళిపోవుచుండును. ఆ నాఁ డతఁడు తెల్లతల్లవారుచుండఁగా లేచి దొడ్డిదారికి పారిపోయి చాకిరేవు కరిగి పెద్ద చాకిబానక్రిందదూరి కూర్చుండెను. నాలుగు గడియలు ప్రొద్దెక్కిన తరువాత చాకలివాఁడు రేవునకుఁ బోయి తన గూననెత్తిచూచునప్పటికి దానియడుగున గణపతి కూర్చుండియుండెను. పంతులు తనజాడ తెలుసుకొని వచ్చెననుకొని గణపతి గూన యెత్తగానె పాఱిపోయెను. తన గూన బగులగొట్టుటకు వీఁడెవఁడో ప్రయత్నము జేయుచున్నాఁడని చాకలి వానిని దరముకొనిపోయెను. లేడివలెఁ పఱుగెత్తుచున్న యా డింబకుని బట్టుకొనలేక మరలి వచ్చెను. మఱియొకనాఁడు బడికి బోవనందుకు మేనమామ కోపించి యీతజువ్వతో నెత్తురు వచ్చునట్లు కొట్టెను. ఆ సాయంకాలము మేనమామ వీధిలోనికి వెళ్ళినతరువాత నేనీ దెబ్బలు తినలేను. చచ్చిపోవుచున్నానని గణపతి తల్లితోఁ చెప్పెను. తల్లి బతిమాలి కోమటింట నటుకులు బెల్లము జీడెలు గొనిపెట్టి యోదార్చెను. గణపతి యవియెల్లభక్షించి మేనమామ నెట్లయిన లొంగదీయవలయునని సంకల్పించి రాత్రియైన తరువాత నిల్లుకదలి వెళ్లుట కతనికి మిక్కిలి భయమగుటచేత తనవంటి దుండగునే మఱియొకనిని సాయము రమ్మని వాని సహాయమున మేనమామ భోజనము చేయుచుండగా దొడ్డిలోనికిఁ బోయి యాపిల్లవాఁడును దానును దోడుపట్టి రాయియొకటి నూతిలోఁ బడ