ఈ పుట అచ్చుదిద్దబడ్డది

118

గ ణ ప తి

అప్పటికి అతని దురదృష్టవశమున దగ్గు సంభవించెను. కాని శరీరము దృఢముగానె యుండెను. గంగాధరుఁడు పునస్సంధాన మైన తరువాత మామగారి ప్రేరణముచేత గాకినాడ వదలి మందపల్లిలో నొకయిల్లుగొని యందు బ్రవేశించెను. కాపురమునకు వెళ్ళిన నాలుగేండ్లకు సింగమ్మకు వరప్రసాది యై పప్పుభొట్ల వంశ రత్నాకర పూర్ణచంద్రుడై, యీ కథానాయకుఁడైన గణపతి జన్మించెను.

ఎనిమిదవ ప్రకరణము

చదువరులారా! మీరెన్నడైన జన్మమధ్యమం దొక పిల్ల పిశాచమును జూచియుందురా? "ఓహోహో ! పిశాచగణములో జేరినవారికె గాని పిశాచములు కనఁబడవు. మేమట్టి పిశాచగణములో జేరిన వారము కాదు కనుక పిల్ల పిశాచమును గాని పెద్ద పిశాచమును గాని జూచి యెఱుఁగ" మని మీరు సంగ్రహముగ నాప్రశ్న కుత్తర మిత్తురు కాబోలు. సరే అట్లయిన క్షమింపుఁడు. పిశాచముల మాట నెత్తదలఁచు కొనలేదు. పోనీ మఱియొక మాట కుత్తరమిండు. మీరెన్నడైన నొక కొండ ముచ్చును జూచియుందురా? చూచియుందురా యని నేను వేరే వేరే యడుగనక్కఱలేదని దలంచెదను. ఏలయన, గొండముచ్చు దర్శనము