ఈ పుట అచ్చుదిద్దబడ్డది

112

గ ణ ప తి

కేర్పడిన మామూలు వసూలు చేసుకొనుటకై ముగ్గురు పోలీసువాండ్రక్కడకు వచ్చిరి. అందులో నొకడు హేడ్డు. తక్కినవాం డ్రిద్దఱు సామాన్య భటులు. ముందుగా వారు పాకలో బ్రవేశించఁ జూదగాండ్రకు నాయకుఁడైన వెంకటస్వామి లేఁడని యొకడుత్తరము జెప్పెను. ఆ పండుకొన్నవారెవరని యొక డడిగెను. రెండవవాఁడు మరికొంత ముందుకు బోయి చూచి "వాఁడు పండుకొనలేదు, చచ్చిపడి యున్నాఁ" డని హేడ్డుతో బదులు చెప్పెను. "ఓరీ తుంటరులారా! కూనీ చేసినారా ? ఇప్పుడు మిమ్ముందఱును బట్టుకొని స్టేషనుకుఁ దీసికొని పోదును. నిలువుఁడు నిలువు" డని హేడ్డధికారముఁ జేసెను. రాళ్ళ నిమిత్తము వెళ్ళిన వెంకటస్వామియు మఱియొకడును వారి రాక జూచి పిక్కల బలమును శరణుజొచ్చి తిరిగి చూడక యొక్క పరుగున నిల్లుజేరిరి. గంగాధరుఁడు తక్క తక్కినవారంద ఱా నరహత్యలో నేదో కొంతభాగము కలవారె. పోలీసువారిని జూడఁగానే గంగాధరుని మీఁది ప్రాణములు మీఁదికి పోయెను. హేడ్డు కోర చూపులు చూచి "యిప్పుడు మిమ్మందరను అరెస్టు చేసి నాము, పాక వదలి వెళ్ళవద్ద"ని హుంకరించి పలికెను. రాజభటులను బ్రసన్నుల జేసికొనుటలో నాఱితేఱిన జూదరులిద్దఱు ముగ్గురందులో నుండిరి. అందొకడు హేడ్డు నావలకు బిలిచి రెందు జేతులు బట్టుకొని యిట్లనియెను. "అయ్యా ! మీరిందులో మమ్మీలాగున శ్రమ పెట్టఁ గూడదు. ఏఁడాదికి