ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

111

జూదమాడ వలసి దని తక్కిన జూదరులు వానిని బలవంతము పెట్టిరి. ఎంత నిర్భంధించినను వాడుఁ పందెము వేయనని బిఱ్ఱబిగిసి కూర్చుండెను. గంగాధరుఁడుఁ గూడ కాఁపు వానిని జూచి "నీకిది న్యాయము కాదు. అందరిసొమ్ము నీవు గెలుచుకొని మూట గట్టుకొని పోవుట మంచిదికాదు. తెల్లవారినదాక నీ వాడి యప్పటి కెంత సొమ్ముండునొ యది పట్టుకొని పోవుట ధర్మ" మని హితోపదేశముఁ జేసెను. కాపువాడు గంగాధరుని మాటా లెక్క సేయఁ డయ్యె. ఇద్దఱు ముగ్గురు జూదగాండ్రావలకుఁ బోయి యేమో గుసగుస లాడి తిరిగి పాకలోనికి వచ్చిరి. కాఁపువాఁడు మూట పట్టుకొని లేచెను. అప్పు డిద్దఱు జూదగాండ్రు వానిని రెండు తన్నులు తన్ని నేలఁ బడవైచి నోట గుడ్డలు గ్రుక్కి చెప్పుల కాళ్ళతో గొంతుమీఁద ద్రొక్కి గడియలోఁ జంపిరి. అట్లు చేయుదు మని వారు గంగాధరునితో నాలోచింపలేదు. అంత పని జరుగునని యత డెన్నఁడు దలంపలేదు. అతఁ డాజానుబాహుడైనను మున్నెప్పుఁడు గ్రౌర్యమెఱుఁగని బ్రాహ్మణుఁ డగుటచే నతని కాళ్ళు గడగడ వడఁకెను. మేన ముచ్చెమటలుఁ బోసెను. అయ్యో! అయ్యో ! ! యను నవ్యక్త ధ్వని తప్ప యతనినోట మారుమాట రాదయ్యెను. తక్కిన జూదగాండ్రు కాఁపువాని శవమునకు రాళ్ళుకట్టి సముద్రములో బాఱవేయ వలయునని బండల నిమిత్తము వెదకు చుండగా నంతలో దొంగ లాంతరు చేతఁ బుచ్చుకొని జూదపు బాకలోఁ దమ