పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/87

ఈ పుట ఆమోదించబడ్డది

అప్పుడక్కడికి పండిత మదనమోహన మాళవీయుడు కూడ వచ్చి యుండెను. ఆయన అధ్యక్షుడుగా హిందూ హైస్కూలులో ఒక మహాసభ ఏర్పాటు కావింపబడెను. ఆ మహాసభలో నాయన వర్ణాశ్రమ సంఘముయొక్క పండితవర్గమువారి వాదములను ఖండించి అస్పృశ్యతా నివారణము యొక్క అవశ్యకతను నిరూపించుచు సంస్కృతమున మహూపన్యాసమును కావించెను. మాలవీయ పండితుడు నాయనను ఎంతగా అభినందించినను ఆ పండితులు ఔదాసీన్యమునే వహించిరి. వారు తొలుత తనకు గావించిన యనాదరమును తలంచుకొనుచు అప్పటినుండి "పండితసభకింక వెళ్ళరాదనియు, వారిని సంస్కరించుటకు యత్నించి, పరాభవింప బడుటకంటె వారు కాలగతిచే పరాభవింపబడు వఱకు వారిని విడిచినచో వారే సంస్కారమును పొందుదురనియు నాయన నిశ్చయించుకొని తన తపస్థ్సలమునకు మఱలెను."[1]

ఈ సమయముననే ఓరుగంటి వేంకట కృష్ణయ్య నాయనకు శిష్యుడయ్యెను. మద్రాసులో పరశువాకములో యన్. దొరస్వామయ్యరు గారి యింట నాయన అతిథిగా నుండగా కొందఱు ఆయనను దర్శించుటకు వచ్చిరి. అప్పుడు చతుర్వేదుల వేంకటకృష్ణయ్య నాయనకు పాదము లొత్తుచుండెను. అప్పుడు నాయన పితృకర్మల యావశ్యకతనుగూర్చి చెప్పుచు కనీసము తద్దినమునైన తప్పక పెట్టవలయునని యుద్ఘాటించుచుండెను. చతుర్వేదుల వేంకట కృష్ణయ్య

  1. * నాయన - పుట 584