పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/61

ఈ పుట ఆమోదించబడ్డది

పుత్రులతో అరుణాచలమునకు పోయి ఒక నెల వుండెను. ఆయన అరుణాచలమునకు బయలుదేరునప్పుడు యమ్. హెచ్. హంఫ్రీసు అను నాంగ్లేయుడు తనకు కలలో కన్పించిన మహానుభావునిగా నాయనను గుర్తించి శిష్యు డయ్యెను. తర్వాత నితడు మహర్షిని కూడ దర్శించెను. ఇరువురిని ఇతడు దివ్యావతార పురుషులుగా కొలుచు చుండెను.

1910 మే నుండి 1912 వఱకు నాయన చెన్నపురములో కాపుర ముండెను. తర్వాత ఆదిశంకరుల జన్మస్థలమగు కాలటి కేగెను. అక్కడ దంపతులు పంచదశీ మహామంత్రమును జపించుచు కొంతకాల ముండి కర్ణాటకములోని గోకర్ణ క్షేత్రమును దర్శించుటకు బయలుదేరి ఉడిపి చేరిరి. అక్కడ సమీపముననున్న బడబాండేశ్వరము అను బలరామక్షేత్రమందు నాయన కొన్నిదినములు ఒంటరిగా తపస్సు చేసెను. అక్కడి పీఠాధిపతులు ఆయన మహత్త్వమును గుర్తించి సత్కరించుటకు సభను ఏర్పాటు చేసిరి. ఆ సభలో ఆయన వారి యభ్యర్థనమున ఆశువుగా మతత్రయ సిద్ధాంతముల సారమును (అద్వైత విశిష్టాద్వైత ద్వైతములు) నూఱు శ్లోకములలో చెప్పెను. అది తత్త్వఘంటాను శాసనముగా, తత్త్వఘంటా శతకముగా ప్రసిద్ధ మయ్యెను. అది మహర్షి యొక్క ఆదరమునకు పాత్ర మయ్యెను.

1912 ఏప్రిలులో నాయన ఉడిపిని వీడి సకుటుంబముగా గోకర్ణమునకు చేరెను. అచ్చట అమ్మ నాయనలు నిగూఢముగా కృష్ణ మఠమునకు వెనుక భాగమున తపస్సు చేయజొచ్చిరి. కోవెల