పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/48

ఈ పుట ఆమోదించబడ్డది

సాధనము యొక్క పద్ధతి. "నేను" అను స్ఫురణలో రెండు భాగము లున్నవి. మొదటిది కర్తృత్వము. రెండవది మనస్సుయొక్క ప్రసరణము. దీనినే వృత్తి యందురు. కర్తృత్వము చేతనము. మనోవృత్తి జడము. ఆలోచనమును అరికట్టి "నేను" యొక్క మూలమునే పరికించుచున్నచో మనోవృత్తి లయము నొంది 'నేను' శుద్ధ చైతన్యముగా భాసించును. శుద్ధ చేతనమైన 'నేను' అను స్ఫూర్తియే ఆత్మ. 'నేను' శుద్ధముగ గోచరించుటయే ఆత్మ సాక్షాత్కారము.

ఇట్లు విచారించుచు కావ్యకంఠుడు మనస్సును అంతర్ముఖ మొనర్చి దాని మూలమును పొందలేక పోయినను దానియొక్క సమీపమున సుఖస్థితి పొంది సుమారొక గంటసేపు ధ్యానమగ్ను డయ్యెను. ఆ స్థితి తొలగినంతనే వాసిష్ఠుడు "ఇప్పటి వఱకును మఱుగున పడియున్న తపో విధానమును పునరుద్ధరించుటకు భగవంతుడే ఈ కాలమునకు తగిన మహర్షిగా ఈ స్వామి రూపమున అవతరించె" నని నిశ్చయించుకొనెను. ఇంతలో స్వామికి పరిచారకుడైన పలని స్వామి అచ్చటికి వచ్చెను. అతని వలన స్వామి పేరు 'వేంకటరామన్‌' అని తెలిసికొని వాసిష్ఠుడు ఆ గురువరేణ్యుని 'భగవాన్ శ్రీ రమణమహర్షి' అని పేర్కొనుట ఉచితమని తలంచెను. వెంటనే పలనిని అడిగి లేఖన సామగ్రిని గైకొని "శ్రీ రమణ పంచకము" అను పేరుతో అయిదు శ్లోకములను రచించి, స్వామి యొద్ద చదివి, అర్థమును తమిళమున వివరించి ఆ శ్లోక రత్నమాలికను గురుదక్షిణముగా వాసిష్ఠుడు ఆయనకు సమ