పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/44

ఈ పుట ఆమోదించబడ్డది

6. రథ చలనము

ఆయన అరుణాచలమున వాసుదేవశాస్త్రి అను శిష్యుని యింట బసచేసి తనకు తపస్సునకు యోగ్యమైన స్థలమును చూపుమని తొందర చేసెను. అతడు మరకత శ్యామాంబికాలయమును (పచ్చైయమ్మన్ కోవెల) యోగ్యస్థలముగా చూపెను. వెంటనే వాసిష్ఠు డచ్చట దీక్షను గైకొని ఆ దేవినే ధ్యానింప నారంభించెను. ఒకనాడు రాత్రి పది గంటల వేళ ఆయనకు మొదట మధురతమ మగు నృత్య శబ్దము వినిపించెను. తర్వాత వందలకొలదిగా శివ గణములు వికృతరూపములతో వచ్చి వికటాట్టహాసములతో ఆయనను పరివేష్ఠించిరి. అది దుర్భరమై ఆయన దుర్గను ప్రార్థించెను. మఱుక్షణముననే ఆ గణములు మాయమయ్యెను. ఆ కోవెల చెంత పసుల కాపరుల యాగడముల వలన ధ్యానమునకు భంగము కలుగు చుండుటచే ఆయన తపస్సునకు నిశ్శబ్ద వాతావరణము ఆవశ్యకమని ఆ ప్రదేశమును వీడి నైరృతి లింగ స్థలమునకు చేరెను. అచ్చట వారము దినములు గడచునప్పటికి అరుణాచలేశ్వరుని యాలయమున కృత్తికోత్సవములు ఆరంభ మయ్యెను.

ఉత్సవము లందు ఏడవనాడు ఊరేగుచుండిన రథము వేద పాఠశాలకు, అన్నధర్మశాలకు మధ్య చదునైన బాట యందే హఠాత్తుగా స్తంభించెను. ప్రజ లెందఱో పూనుకొని ఎంత లాగినను ఆశ్చర్యకరముగా అది కదల లేదు. వారు అర్ధ రాత్రి వఱకును దానితో పెనగులాడి అలసిపోయి యిండ్లకు పోయిరి. అట్లగుట పెద్ద యనర్థమునకు కారణ మగునని అందఱు అలజడి నొంద