పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/33

ఈ పుట ఆమోదించబడ్డది

పరితపించుచుండెను. 1903 జనవరిలో ఒకనాడు బ్రాహ్మణ స్వామిని దర్శించినచో తనకు ధన్యత్వము కలుగవచ్చునని కావ్యకంఠునకు తోచెను. వెంటనే విశ్వనాథయ్యరు అను పరిచితునితో కొండపైనున్న యాస్వామి యొద్దకుపోయెను.

బ్రాహ్మణస్వామి 1 - 9 - 1896 లో తిరుచ్చుళి నుండి అచ్చటికి వచ్చి అనేక స్థలములలో గాఢ సమాధియందుండి జ్ఞానిగా జనులచే గుర్తింపబడి సేవింపబడుచున్నను మౌనము నవలంబించి యుండెను. అప్పటివఱకు ఆయనవాక్కు ఎవని విషయమునను ప్రసరింపలేదు.

వీ రిరువురు విరూపాక్షి గుహలో స్వామినిగానక పద్మనాభాశ్రమమునకు పోయిరి. అచ్చట నొక ఱాతిపై బ్రాహ్మణస్వామి కూర్చుండియుండెను. ఆయనను చూడగానే కావ్యకంఠుడు దుర్గా మందిరయోగి చెప్పిన స్థూలశిరస్సు ఇతడే యని గుర్తుంచి ఆయన యందున్న యోజస్సునకు ఆశ్చర్యపడి చేతులు జోడించి నమస్కరించెను. ఆశ్రమ ముఖమున పద్మనాభస్వామి అను జటాధారి వ్యాఘ్రాసనముపై కూర్చుండియుండెను. విశ్వనాథయ్యరు ఆ జటాధారిని గూర్చి కావ్యకంఠునకు ఎంతో ప్రశంసించి చెప్పెను. కాని కావ్యకంఠుడు అతనిని తేజోహీనునిగా గమనించి నమస్కరింపక కూర్చుండెను. ఆ యవినయమునకు జటాధారి కినుక నొందియు గడ్డమును సవరించుకొనుచు, "గణపతిపరమైన "శుక్లాంబరధరమ్" అని మొదలగు శ్లోకమును విష్ణుపరముగా మీరు చెప్పగలరా ?" అని కావ్యకంఠుని ప్రశ్నించెను. ఆయన కోపముతో ఆ శ్లోకమును