పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/133

ఈ పుట ఆమోదించబడ్డది

కర్మలందు వినియోగింపబడుచున్న పెక్కు మంత్రములను ఆధ్యాత్మ పరముగా వ్యాఖ్యానింప వలసిన యావశ్యకత యున్నదని ఆయన వారికి వివరించి చెప్పెను.*[1]

25-4-1936 తేది తనకు ఇష్టము లేకున్నను, ఖడ్గపురము వారు వచ్చి తొందర జేయగా నాయన అక్కడ నిర్మింపబడిన యాశ్రమములో నుండుటకు బయలుదేరి వెళ్ళెను. అది నింపురా చివఱ నుండెను. వేదుల రామమూర్తి, పార్వతీశము, నేమాని సూర్యనారాయణ మొదలగువారి యిండ్లు అన్నియు దానికి రెండు మూడు మైళ్ళ దూరములో నుండెను. అందువలన నాయన సేవ యందు అనుక్షణము శ్రద్ద చూపుటకు వారికి అవకాశము లేకుండెను. ఆశ్రమ నిర్మాణము నందు, నిర్వహణము నందును రామమూర్తి ప్రధాన భాధ్యత వహించి యుండెను. ఆశ్రమ విషయములలో మొదట ప్రగల్భములు పలికిన వారెవరును సాయము చేయుటకు ముందుకు రాకుండిరి. భారమంతయు రామమూర్తి పైననే పడెను. అప్పటికి ఆశ్రమము పేరుతో ఒక పాక మాత్రమే ఏర్పడి యుండెను. అక్కడ వంట చేయుటకు ఏర్పాట్లు లేకుండెను. సమీపమున సోమయాజుల సూర్యనారాయణ అను గృహస్థు వుండెను. ఆయనకు జీతము తక్కువ, కుటుంబ భారము ఎక్కువ. ఆయన యింటి యందు నాయనకు పగటి పూట భోజనము ఏర్పఱచి, రాత్రిభోజనము కొఱకు రొట్టెలను ఒక జనవాసము నుండి (colony) పంపు చుండిరి. శనివారములలో మధ్యాహ్నము కార్యాలయములలో

  1. * నాయన పుటలు 708 - 714