పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/12

ఈ పుట ఆమోదించబడ్డది

చదువులతో మొదలైన నాయన జీవితము చదువు నశించి, విద్యతో అంతమైనది. కావుననే నాయన 'నాయన'గనే అందరినోట తెలిసియో తెలియకయో పిలువబడుచున్నాడు. నాయనలోని విశిష్ఠత, విశ్లేషణలకు అందనిది, విచక్షణకు చిక్కనిది, విచారణకు దొరకనిది.

దాదాపు 14 (పదునాలుగు) సం||లు అరుణగిరిమీద మొలకు గోచితో, చేతిలో కర్రతో, అటునిటు తిరుగుచూ, చూచుచూ, చూడకుండా, ఆయనను చూడటానికి, దర్శించడానికి వచ్చిన వారిచేత బ్రాహ్మణస్వామిగా, మౌనస్వామిగా పిలువబడుచూ వచ్చిన జంగమ మగు అనంతశక్తి, చివరకు అ జంగమమునకు భౌతికముగా కారకురాలైన తల్లివచ్చి మూడు దినములు రోదించి, విలపించినా, పెదవికదపక, మౌనముగా నుండిన తేజోమూర్తిని, పెదవిని కదిలించి, కంఠమును స్వరపరచినది నాయన. అ క్షణమునుండే ఆయనను దర్శించే వారందరి పంటలు పండినవి. వీనులకు విందులు, కనులకు పసందులు. జిహ్వకు రుచులు, ఆత్మకు అభిరుచులు ఆటలు, పాటలు - ఇలా ఎన్నో, యింకెన్నెన్నో మానవులకు అందని మధురానుభూతిని అనుగ్రహించినది. - మన నాయన నడచి వచ్చి నయనానందకరముగా ఆ మౌనస్వామిని మౌనమునుండి విడిపించి "నాయనా' అని పిలిపించుకొని మనలను తరింపజేసినది - ఆ క్షణమునుండే.

అంతవరకు అంతుదొరకని, అర్థంకాని, అదేదో తెలియని మౌనం - అంటే నిశ్శబ్దంలో వుండిన దొక ఆకారము. దానికే భగవాన్ రమణ మహర్షి అని తర్వాత నామకరణము జరిగింది.

ఇక నాయనో! ఒకటే శబ్దజాలమయం. చిన్ననాడే నవద్వీపములో కావ్యకంఠ బిరుదు. మహారాజుల వద్ద సన్మాన, సత్కార, గౌరవాదులు, అనేక మంత్ర, యంత్ర తంత్ర శాస్త్రములలో సరిలేని జోడు. పట్టుదలకు మారుపేరు. వ్యక్తులను, వక్తలను, ప్రత్యర్థులను