పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/117

ఈ పుట ఆమోదించబడ్డది

లత్వము నిరస్తము చేయబడెను. స్థయిర్యము అభ్యసింపబడెను. అట్లయినను నేను తృప్తి జెందలేదు. ఇప్పుడింక భక్తిచేతనే తృప్తి బొందగోరు చుంటిని. అ భక్తికి మూడు స్థానములున్నవి. ప్రథమస్థానము భగవాన్ మహర్షి, ద్వితీయస్థానము భగవా నింద్రుడు. తృతీయ స్థానము భగవతి మాతా భారతభూమి.[1]

ఇట్లు మీ చిరకాల భక్తుడైన

గణపతి.

ఈ లేఖలవలన ఆత్మనిష్ఠను నిలుపుకొనుటకై నాయన మనస్సునందు ఎంత సంఘర్షణము నొందుచుండెనో స్పష్టమగు చున్నది. మార్చి 17 వ్రాసిన లేఖలో " శుద్దసద్రూపమును పొందుటకు యత్నించుచుంటిని" అని తన లక్ష్యమును ఆయన స్పష్ట మొనర్చెను. ఈ లక్ష్యము తనకు సిద్ధించుటకు అవతార పురుషుడైన రమణుడు సంకల్పము చేయవలయునని 24 వ తేది లేఖలో ప్రార్థించెను. "నే నెప్పుడు మీ పాదముల యొద్దనే శయనించుచుంటిని. మీరు నాకు నియోగించు ప్రభువులు. నేను మీకు కార్యదాసుడను" అని 14-4-31 తేది లేఖలో నాయన వ్రాసిన వాక్యములు ఆయన యందున్న గురుభక్తిని వ్యక్తీకరించు చున్నవి. గురువును సేవించునప్పుడు అహంకారమును పూర్తిగా వీడి దాస్యమొనరించుటకు కూడ సిద్దపడవలయునని ఎల్లరు

  1. * నాయన - పుటలు 636 నుండి 645 వఱకు వాసిష్ఠ వైభవమ్ ఉత్తరభాగము - ప్రకరణము - 7