భగవన్, మాయామానుషా,
5-5-1931
.... .... ప్రభో! నా స్థితిని కొంచెము తమ చరణసన్నిధిని నివేదించుకొనుటకు నే నుత్సాహపడుచుంటిని. గొప్ప ఆనందమును పరమ లక్ష్యముగా కొందఱెంచుదురు. నిరతిశయ యోగసిద్ధి ముఖ్య లక్ష్యమని మఱికొందరు తలంతురు. సుఖ దుఃఖాతీత స్థితి యింకను కొందఱికి లక్ష్యమగుచున్నది. కొందఱు మృత్యు విజయము గొప్పదందురు. నేను మాత్రము కామోపశాంతి కమనీయ లక్ష్యమని తెలియుచుంటిని. నిస్సారములైన కొన్ని కామము లుపశాంతి నొందెను. కొన్ని యనుభవింపబడి శాంతి బొందెను. దూరము జేయబడి మఱికొన్ని యుపశాంతి గావింప బడెను. సారమున్నదో లేదో కాని నాకొక్క కామ్యము మాత్రముండి పోయెను. దానిని నిషేధించుటకు శక్తిలేదు దూరముగా పొమ్మనుటకు ఇచ్ఛలేదు. నా కష్టములో భగవంతుని సహాయమును యాచించు చుంటిని. ఆ నా కోర్కె భగవంతునకు తెలిసియే యుండును.
ఇట్లు
" ................ "
భగవన్, భక్తవత్సలా,
22-7-1931
మంత్రజప మహిమ వీక్షింపబడెను. యోగసారము విలోకించ బడెను. కుండలినీశక్త్యుల్లాసము పరీక్షింపబడెను. "అహం" యొక్క జన్మస్థలము నిరీక్షించబడెను. మౌనముచే ప్రకృతి పాక మన్వీక్షింపబడెను. భేదభావము దూరీకృతము గావింపబడెను. చప