పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/107

ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీమాత యందు నాయన ప్రకటించిన వినయ విధేయతలు భక్తి భావము రమణ భక్తులకు తెలియకుండ నుండవు. వారు దీనివలన ఆయన యందు అనాదరమును పొంది యుండుటయు సంభవించి యుండును.

ఈ సందర్భమున శ్రీఅరవిందుని సిద్దాంతములను గూర్చి భగవానుని భావము లెట్లుండెనో గ్రహించుట యుక్తము.

13-3-1936 తేది బొంబాయి నుండి వచ్చిన ఒక పెద్దాయన మహర్షితో ఇట్లనెను. "శ్రీఅరవిందాశ్రమమున నేను మాతను ఈ ప్రశ్నఅడిగితిని. భగవంతుడు తన నిజస్వరూపమున గోచరింపవలె నని నేను తలంపులు లేకుండ మనస్సును శూన్యమొనర్చు చున్నాను. కాని నా కేమియు కన్పించుట లేదు.' ఆమె యిచ్చిన సమాధానమున విషయము ఇట్లు వున్నది. 'పద్దతి సరిగానే యున్నది. పైనుండి శక్తి క్రిందికి వచ్చును. అది ప్రత్యక్షమగు అనుభూతి.' కాబట్టి ఇంకపైన నేను ఏమి చేయవలె?"

మహర్షి: నీవు ఏదిగా నున్నావో అట్లే యుండుము. పైనుండి క్రిందికి వచ్చునది కాని, అభివ్యక్త మగునదికాని ఏదియును లేదు. అహంకారమును తొలగించుకొనుటయే కావలసినది. ఏది యున్నదో అది ఎప్పుడును వున్నది. ఇప్పుడు కూడ నీవు అదిగానే యున్నావు. దానికంటె భిన్నముగా లేవు. ఆ శూన్యము నీచే చూడబడు చున్నది. దానిని చూచుచు నీవు వున్నావు. నీవు దేనికొఱకు వేచియుండ వలె? 'నేను చూడ లేదు' అను తలంపు, చూడ వలయునను