పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/33

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొమ్మూరు

27


స్వస్తిశ్రీ విజయాభ్యుదయ శాలివాహన శక పరుషంబ్బులు ౧౪२౦ (1548 AD) ఆగునేటి ప్లవంగ్ల సంవత్సర కాత్తి౯క శుద్ధ ౧౧ సోమవారం రోజ్ను యేతద్ధమ౯ంబ్బులు శాసన స్తంభంబ్బుల మీద లిఖింపచేశినారు.

తదనంత్తరం శ్రీ రంగ్గ రాయ దేవ మహారాయులుంగ్గారు ప్రభుత్వము చేశే కాలమంద్దు చతుధ౯కులుడైన శేషాద్రినాయుడు గార్కి యీ దేశాన్కు ప్రభుత్వం యిచ్చిరి గన్కు అతను అధికారం చేస్తూ వుండ్డి స్వామి వార్కి బయట ప్రాకారం కట్టించ్చి రాజులు౦గారు కట్టడి చేశ్ని ప్రకారం జరిగించ్చి గుడి పారతత్తి స్థానీకులు మొదలయ్ని వారు స్వామి వారి యొక్క హక్కు వంచ్చన చేశి హరించ్చకుండా స్వస్తిశ్రీ శాలివాహన శక వర్షంబ్బులు ౧౪౮౬ (1564 AD) ఆగు నేటి యువ్వసంవత్సర కాత్తీ౯క బహుళ 30లు గురువారం రోజ్ను యేత ధమ౯ంబ్బులు శాసన స్తంభంబ్బుల మీద లిఖింప్ప చేశి ప్రమాణంబ్బులిడి శాలివాహనం ౧౫౦౦ (1578 AD) వర్కు ప్రభుత్వము చేశెను.

తదనంత్తరం కన్నా౯ట్క రాజులను జయించ్చి మ్లేచ్ఛులు దేశములు ఆక్రమించ్చి బారాముత సద్ధీ హోదాలను నిన్న౯యించ్చి సర్కారు సముతు బంద్దీలు చేశే యడల యీ గ్రామం చర్కూరు సముతులో చేర్చినారు గన్కు సముతు అమీలు చౌదరు దేశపాండ్యాల పరంగ్గా బహుదినములు అమాని మామ్లియ్యతు జర్గించ్చినారు. అప్పట్లో యీ స్వామి వాల్ల౯కు పూర్వీకమయ్ని అగ్రహారములు మొదలయ్నివి జప్తు చేస్కుని నిత్య నైవేద్య దీపారాధనల్కు స్వామి వారి యొక్క పరిజనానకుంన్ను చేశ్ని నగలు--

౮ శ్రీ స్వామి వాల్ల౯కు
కు ౫ శ్రీ అగస్తేశ్వర స్వామి వారి
కు ౩ శ్రీ చన్నకేశవ స్వామి వార్కి
౧ ౫ ౹ ౦ పరివారాన్కు
కు ౧ స్తానాచాల్ల౯
కు ౮ స్వస్తి వాచకులు
కు ౩ భజంత్రీలకు
కు ౩ భోగం వాండ్లకు
కు ౦ ౹ ౦ భట్టు మాధవునికి
౨ ౩ ౹ ౦

గగ ౧ ౮ వుత్సవాదులు మొదలయిన వాట్కి సాలీనా

౧ ౦ శ్రీ అగస్తేశ్వర స్వామి వారికి
౮ శ్రీ చన్న కేశవ స్వామి వారికి.