పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/153

ఈ పుటను అచ్చుదిద్దలేదు

147 బాపట్ల కయిఫియ్యతు మౌజే బాపట్ల ఆముదాల పల్లి సర్కారు నిజాం పట్టణం శ్లో॥ బ్రహ్మారణ్వేశరణ్యే కృతయుగ విహితే బ్రహ్మయజ్ఞోపరాధాజు 11 ఏతత్రాత్రా యుగే వ్వాక్పటుతరము నిభిఃపూజితం ద్వాపరాం తే శేషత్వం, క్షీర వృక్షం శరణముప గతం తత్ఫలం భావనాఘ్యాం పిప్రాచ్యాం చోళపూజ్యం విమల కలియుగే భావనారాయణాఖ్యంగా 1 [శ్లో॥ బ్రహ్మారణ్యే శరణ్యే కృతయుగ విహితే బ్రహ్మయజ్ఞే పరార్ధే | ఎతత్రే తాయుగే వాక్పటుతరమునిభిః పూజితం ద్వాపరాంతే | శేషత్వం క్షీర వృక్షం శరణము పగతం తత్ఫలం భావనాఘ్యాం | ప్రాచ్యాం చోళ పూజ్యం విమల కలియుగే భావనారాయణాఖ్యం ] తా॥ పూర్వం కృతయుగమున సర్వులకు శరణ్యమైన బ్రహ్మారణ్యముండెడిది. అది బ్రహ్మదేవుని యజ్ఞోపయెగమైనది. ఆడియే త్రేతాయుగమున బ్రహ్మాది దేవతలకు మహా మునులకు తపస్సు నొనరించుకొను ప్రదేశమైనది. ఆ స్థలమున ద్వాపర యుగమందలి బ్రాహ్మణులు ఆదిశేషుని నిలిపి పూజించిరి. దానిని కలియుగమున చోళరాజులు భావనారాయణ అనుపేరుతో పూజించిరి) CAME కృతయుగమందు నిర్మింపబడిన ఘవఁట్టి శ్రేష్ఠమయిన వంటి బ్రహ్మారణ్యమందు శ్రేష్ఠమై నషువంట్టి బ్రంహ్మ యొక్క యజ్ఞం అవుతూవుండగా శేషభావమున పొంద్దినషువంట్టి శ్రీ స్వామి త్రేతాయుగాంత్యమందు వేద వేదాంగాధ్యయనములు గలిగినషు వంట్టి రుషులచేత ద్వాపర యుగాం త్తర పర్యంత్తెరం పూజచేయబడినషు వంట్టి -. .... బట్టదు. గృహమును తాను ఆశ్రయం యిచ్చినషు వంటి భావన అనే పేరు గలిగినపువంటిన్ని యిద్దరు బ్రాంహ్మణులచేతను కలియుగమందు చోళ చక్రవత్తికి పూజ్యం అయినషు వంటింన్ని భావానారాయణస్వామి అనేషువంట్టి స్వరూపము ప్రకాశిస్తూ వుంన్నది. తదనంతరం అరణ్యంలోకి కొండ్డపాటూరి సంసార్లు భావమరది అనేవాఁడ్లు యిద్దరు కాష్ఠ భేదన-నిమిత్తం కుద్ధాలధరులై వచ్చి చేరి వకదార్నిబోయి కొట్టి భేదన చేస్తూ పుఁడ్డగా అందులో పెద్దవాడు అయిన వాడు పాలవృక్షమున గొడ్డలి వేసి నరికేవరకు ఆ చెట్టున రక్తం వడెశి వాడు మూచాణక్రాంత్తుడై పడినంద్ను రెండోవాడు సామీప్యమునకు వచ్చి భావా అని పిలిచే వర్కు ఆ చెట్టున వోహోయని ధ్వని వినబడెను గన్కు అంతట మరిది అనేవాడు వృక్షం వద్దకి వచ్చి భీతా హపడి యిలాగ్ను చేశిన దేమున్కి ప్రతియాదివారమున్ను పొంగళ్లు చేస్తామని ప్రాధన చేశినంద్ను అంతట పడియున్న వాన్కి దైవానుగ్రహం చేతను మూచకా తెలిశి అచ్చటనుండి మ్రొక్కు లిడి