పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/122

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

116

అప్పికట్ల కయిఫియ్యతు


మడు సరసన అనుమతిని కట్టడ చేశిన ప్రకారం ఆ గుడి పూడిని పండ్డిన నానా ధాన్యాదులు పారిన పుట్లకల్లాను (ఖ౧కి) పుట్టి వకటింటికి అద్దేంట్టి లెఖ్కను సమర ౯ణచేస్తిమి గనుక యి చొప్పున గాన నవ ధరించితిని. యింద్కు యవ్వరు తప్పినా గంగ్గలో గో బ్రాహ్మణ వధ చేశ్ని వారి పాతకాన బోదురు. సదా శివున్ని చేసిన అప౯ణం.

స్వామి వార్కి యిప్పుడు వుండే వసతులు, కు ౦౺౦ మజుకూరిలో స్వామి వారికి నైవేద్య దీపారాధనలు జరుగగలిందులకు చెర్వు కిందను వున్న మాన్యం.

జరానా గ్రామాదులలో
యీ పూరు
భరితెపూడి
అప్పికట్ల

యీ దేవాలయం బహు పూర్వ ప్రతిష్ఠ లింగ్గముత్తి౯ స్వయమయినది. వకరాతి మీద అష్టశక్తులును విఘ్నేశ్వరునికి చెక్కి వుంన్నారు. అవి చాలా మజుబూతుగా వున్నవి. యీ స్థలానికి అర్చకులు శివబ్రాహ్మలు. అప్పికట్ల వారు వుండ్డ ఖిలమైపోయినారు. గన్కు వారు దౌహిత్రులు నూతలపాటి వారు మూడు పురుషాంతాల నుంచి— బుచ్చన్న, వీరన్న— మృత్యుంజయుడు వీరలు మట్టుకు అచ౯న చేస్తూ వున్నారు. తుర్కలలో విశేషవుత్సవాలు జరగడం లేదు. పూర్వపు వృత్తులు జమీదాలు ౯ హరించ్చినారు.

గ్రామకయిఫియ్యతు శంకర లింగ్గము ఆలయ రహితంగ్గా వున్నది. వినాయకుడు వున్నాడు గ్రామ మధ్య శ్రీ వెంక్కటేశ్వల౯ ఆలయం వుంన్నది. మద్యను కొన్ని దినములు ఆచ౯కత్వం జరిగినది. తిర్గి ఆరు సంవత్సరముల నుండి అంత్తర్వుపడినది. ఆలయములో మూల విగ్రహం వుంన్నది. వుత్సవ విగ్రహాలు శ్రీ చూన౯ం తిరుమణి నేత్రాలు మొదలయి నవి గూడవల్లి కాపురస్థుడయ్ని బృందావనం నరసింహచార్యులవద్ద నుంన్నవి. ప్రమోదూత నామ సంవ్వత్సర పుష్య శు౬ సోమవారం శ్రీ స్వామి వుత్సవానకు గ్రాములోను హె౦౨ వరహాలు పరషాచనం వున్నది.

గ్రామాన్కు దక్షణం యేనుగల కాడు అని వుంన్నది. దానికి యీ పేరు వచ్చ్ని వైనం కల౯పాలెం పాటి మీదను పూర్వజయిన పట్నం గన్కు జనాధ౯న రాయడనే జయ్ని రాజు యొక్క యేనుగులు యీ కాడు అని పేరు వచ్చినది. తామ్ర శాసనములు మొదలయినవి లేవు.

ప్రమోదూత నామ సంవ్వత్సర పుష్య శు ౧౩ సోమవారం ఆన ౧౮౧౧ సంవత్సరం ది. ౧ జనవరి ౹౹

దస్తకతు పులిగడ్డ మల్లయ్య వ్రాలు.