పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/107

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేటూరి కథ

101


రామానుజులు తండ్రి కన్న ప్రబలుడై యీ గ్రామాన్కు యీశాన్య భాగమంద్ను శివాలయం కట్టించ్చి శ్రీ రామలింగస్వామి వారనే లింగ్డమూత్తి౯ని ప్రతిష్ఠ చేశి యీ స్వామి వారిని పూజించ్చడాన్కు కంచ్చిభట్లు పాపంన్న అనే వెలనాటి బ్రాంహ్మణ్ణి నిన౯యించ్చి యీ స్వామి వారి నిత్య నైవేద్య దీపారాధనలు జరుగగలంద్లుకు కు ౧౹౦ కుచ్చలపాతికె భూమి యినాములు యిప్పించినారు అఖండం సాలియానా వచ్చే పండగలు మొదలయ్ని వుత్సవముల్కు పయిన వ్రాశ్ని ప్రకారంగ్గానే జర్గెటట్టు మామూలు చేశినారు.

వడ్డెరెడ్డి కనా౯టక ప్రభుత్వములు శా ౧౫౦౦ శకం (1578 AD) వరకు జరిగిన తర్వాతను తుర్కాణ్యం ప్రబలమాయెగన్కు జమీదారు దేశ ముఖు దేశపాండ్యాలు మొదలయ్ని హోదాలు యేప౯రచి బహు దినములు అమాని మామిలియ్యకు జరిగించ్చినారు.

స్న ౦౧౨౨ ఫసలీ (1712 AD) తాలూకా జమీదాలకు తెరుగడలు చేశే యడల యీ వినికొండ పరగణా రాజా మల్రాజు సూరంన్న గారి జమీదారిలో వచ్చెను గన్కు సూరంన్న గారు రామారాయునింగారు నీలాద్రి రాయునింగారు వెంక్కట నరసారాయునింగారు పెదగుండ్డా రాయునింగారు ప్రభుత్వములు చేశ్ని తర్వాతను పయిన వాశ్ని పెదవెంక్కట నర్సారాయునింగారి కొమారులయ్ని రాజా వెంక్కట గుండ్డారాయునింగారు ప్రభుత్వం చేస్తూ వున్నారు.

రిమారుకు గ్రామ గుడి కట్టు కుచ్చళ్ళు ౮౦
కి మ్ని హాలు
గ్రామ కంఠాలు
२ ౦ కంద్దసాల --
౦ కొండ్రాజు పాడు అనే చెనెదిబ్బ
౪ ౧ నంద్ధికుంట్ట కాశి కాలవారి పాడు
౧ ౺ ఽ మాలపాడు
చెరువులు కుంట్టలు ౧౦ కి
౧ చెరువులు ౫కి
౦ ౹ ౦ మజ్కూరి వూర చెరువు
౦ ౹ ఽ పెనీ౯డు చెరువు
౦ ౦ ఽ మల్లయ చెరువు
౦ ౦ ఽ పాల్నీడు కుంట్ట
౦ ౦ ఽ వెంక్కట కుంట్ట
౦ ౻ ఽ కుంట్టలు ౫కి
౦ ౹ ౦ నాగరాజు కుంట్ట