పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/95

ఈ పుట అచ్చుదిద్దబడ్డది
82

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

రోమసు కాథలిక్కు మతమును స్వీకరించెను. క్రమక్రమ ముగా ఫ్రాన్సు దేశ మంతయు నీయనకు లోబడి ఈయనను రాజుగా గ్రహించెను. కాని పోపు అంగీకరించనిది ప్రయో జనము లేదు. 1595 సంవత్సరమున నాలుగవ హెన్రీ రోముకు పోయి పోఫుగారు విధించిన ప్రాయశ్చిత్తమును చేసికొని పోపు గారిచే రోమును కాథలిక్కుగ సంగీక రించబడెను. నాలు గవ హేన్రీ రోమను కాథలిక్కగు స్పెయిను రాజుతో సంధి చేసికొనెను. పరాసు దేశములోని ప్రొటెస్టెంటు లందరును ప్రభుమందిరము లలోను కొన్ని పట్టణములలోను ఆ రాధనను సలుపుకొనవచ్చు సనియు, సర్వకశాలలలో చదువుకొను టకును ప్రభుత్వోద్యోగములలో ప్రవేశించుటకును అర్హులని యు, 1598 సంవత్సరమున నాన్ టీసు ఈడిక్టు అను శాస నము గావించెను. ఇది శాశ్వతముగ నుండవలెనని కూడ శాసించెను. ఇందువలన రోమను కాథలిక్కు మతగురువులలో నసం తృప్తిగలిగి కొందరీయనను చంపయత్నించిరి. అట్టివారి నీయన దేశములోనుండి వెడలగొట్టెను. 1610 వ సంవత్సర మున జర్మనీలో ప్రొటెస్టెంటులకును రోమును కాథలిక్కుల కుసు పోరాటము కలిగెను. ఈయన ప్రొటెస్టెంటుల పక్షమున సైన్యములతో బయలు దేరి వెళ్లుచుండగా నొక రోమను కాథ. లిక్కు మతస్థు డీయనను పొడిచి చంపెను.


తరువాత పదునాలుగవ లూయిరాజు 1685 వ సంవత్స, రమున నాన్ టటిసు శాసనమునురద్దుపరచి ప్రొటెస్టెంటుల దేవాలయములను పడగొట్టెను. వారి యాస్తులను స్వాధీన .