పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/29

ఈ పుట అచ్చుదిద్దబడ్డది
16

ఫ్రెంచి స్వాతంత్యవిజయము

ఆచుట్టు ప్రాంతమును జయించి యచట క్రైస్తవరాజ్యమును స్థిరముగ స్థాపించెను. ఈ ప్రాంతమునుండి క్రైస్తవులు మహమ్మ దీయులను ముట్టడించుచు తుదకు చాల కాలమయిన తరువాత స్పెయిన్ నుండి మహమ్మదీయులను వెడల గొట్ట గలిగిరి. తారువాత షార్ల మేనురాజు శాక్సనీపై దాడి వెడలెను. శాక్సనీ ప్రజలు క్రైస్తవమతమును స్వీకరించ లేదు. క్రైస్తవ మతబోధకులను వారి సహాయముగ వెళ్ళిన క్రైస్తవ సేనలను వెడలగొట్టిరి.తమ స్వమతమును దీక్షగా నవలంబించి యుండిరి. అట్టి శాక్సను ప్రజల పై షార్ల మేను దండెత్తి ప్రధమమున వారిచే నోడింప బడెను. ఉభయుల మధ్యను తీవ్రమగు పోరు జరిగెను, షార్ల మేసు జయమొందెను. వారి నాయకుడగు విడుకిండు చే బలవంతముగ క్రైస్తవమత స్వీకారమును చేయించెను. కొల దికాలములో శాక్సనులు మరల తీరుగబాటు చేసిరి. షార్ల మేను తిరుగ బాటును మిగుల క్రూరముగ నణచి నాలుగు వే లమంది తీరుగుబాటుదార్లను శిర చ్ఛేదము గావించెను. శాక్స నీలో కత్తి బట్టి బలవంతముగ ప్రజలను క్రైస్తవులుగా గావించె ను.. ఆ రాష్ట్రము నందంతట క్రైస్తవ మందిరములను నిర్మించె సు. ఈ విధముగా కఠినమగు పద్ధతులతో ప్రాన్కుల రాజ్య మును క్రైస్తవమతమును శాశ్వతముగ శాక్సినీలో స్థాపించెను. అటుతరువాత షార్ల మేను రాజు బవేరియా రాష్ట్రమును, యా వత్తు జర్మము దేశమును, అటు పైన - హమియా దేశమును జయించెను. అక్కడనుండి ఇపుడు ఆస్ట్రియూ హంగెరీయని పిలువ బడు దేశమునంతను అపుడచట నివసించియున్న అవారులను

'