పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/224

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

203

పదునాలుగవ అధ్యాయము


పూర్తిగా నోడింపబడి చెల్లా చెదురయ్యెను. లపయతు సేనాని తెన సేనలను మరల్చుకొని ప్రాన్సు సరిహద్దుచేరెను. " శతృ పులు ప్యారిసు మీద పడుదురను భయము ప్యారిసు ప్రజల లో కలిగి విశేషకలవరమును కలిగించెను,

రాజు యొక్క
ప్రవర్తనము

విప్లవమునకు వ్యతిరేకులగు ప్రభుపక్ష పాతులు సంతస మును వెలిబుచ్చిరి '. రాజు తన స్వంత సైన్యము హెచ్చించుచుండెను. విప్లవమునకు వ్యతిరేకులనుండి సైనికులను చేర్చుకొనుచుండెను. రాణిచుట్టును ఆస్ట్రియా రాజుతో, సలహాలు చేయుచున్న బృంద మొకటి చేరెను. శాసనసభ వారు వెంటనే ప్యారిసు సునగరమున నిరువది వేలమంది రిజర్వు సైనికులను తయారు చేసిరి, రాజు యొక్క- స్వంత సైన్యములను, రాణియొక్క ఆస్ట్రియా బృంద మును తీసివేయవలెనని కోరిరి.జాతీయ ప్రభుత్వముచే నంగీకరింప పబడని మతగురువుల నెల్ల కల్లోలములను పురిగొల్పుచున్నం దున వెంటసే ఫ్రాన్ను దేశమును వదలిపోపలసినదని శాసనము చేసిరి. ఈ శాసనమును రాజు త్రోసివేసెను. రాజు గీరాం డిస్టు మంత్రును వెళ్ళగొట్టి, మితవాదులు నుండి. మంత్రివర్గము నేర్పంచుకొనెను. ప్రజలలో పలుకుబడి. గోల్పోయినవారును, స్వల్ప సంఖ్యాకులు సగు మితవాదుల మీద ఆధార పడక , రాజు తన యాశలనన్నిటిని యూపురాజులమీద పెట్టుకొనెను. మేలన్ డూపాన్ అను రాయబారి ద్వారా విదేశ రాజులకు కబు రంపెను. దేశము యొక్క కష్టముల కన్నిటికిని రాజే కారకు కుడగ నున్నాడని శాసనసభ వారి అంగీకారముతో రోలెండను