పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/207

ఈ పుట అచ్చుదిద్దబడ్డది
196

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

నొద్ద చేరి కుట్రలు చేయుచుండిరి. ఆస్ట్రియా రాజు లియోపాల్డు ఫెంచిరాణికి సోదరుడు. ఫెంచి ప్రభువులును మతగురువు లున ఫాన్సు దేశము విడిచి బయట సరిహద్దున జర్మనీలో గుమిగూడుచుండిరి. లూయీరాజు పారిపోయి వీరితో చేరు నేమోయని ప్యారిసువజలు భయపడుచుండిరి. రాజు తన మేన త్తలను ఇటలీకి పంపెను. ప్రజలసం దేహము మరింత హెచ్చెను. ప్యారీసు నుండి సెంటు క్లాసుడు వెళ్ళవలెనని రాజు యత్నించగా ప్యాసుపజలు అడ్డుపడి వెళ్ళకుండ చేసిరి.

యూరపు రాజుల
సమావేశము

1791 సంవత్సరము 20 వ మే తేదీన ఇటలీలోని యూరపులోని రాజుల సమావేశ మయ్యెను. ఆస్ట్రియా, ప్రష్యా, రుష్యా, స్వీడెను, జర్మను. రాష్ట్రములు, సార్డియా, స్పెయిన్ ,ఇం గ్లాండు, పైడి మాంటు రాజుల ప్రతినిధులు కలిసి, ప్రెంచి ప్రజల మీది కొక లక్ష సైన్యములను పంపి, లూయిరాజు యొక్క, యధికారమును పునరుద్ధరించవలయునని రహస్యముగా తీర్మానించుకొని. తమ తోడి రాజగు లూయీ రాజును ఫ్రెంచి ప్రజలు అవమానపరచి యిబ్బంది కలుగ జేయు చున్నందుకు తమ అసమ్మతిని ముందుగా ఖండితముగా ప్రచు రెంచి జులై నెలలో వివిధ రాజుల సైన్యములు నలువైపులనుం డియు నొకసారిగా ఫ్రాన్సును ముట్టడించవలె ననియు, అంత వరకు నీ సంగతి రహస్యముగా నుంచవలెననియు నిశ్చయించు కొనిరి. కొంత రాజ్యము కలుపుకొనవలెనని ఆస్ట్రియా యొక్క ఆశ. అమెరికాకు ఫోన్సు సహాయము చేసినందులకు ఫాస్సు