పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/15

ఈ పుట అచ్చుదిద్దబడ్డది
4

ప్రెంచిస్వాతంత్ర్యవిజయము


నికిని తన భార్యను పిల్లలను చంపుటకుగూడ హక్కుగలదు. గాలు దేశీయులు మిగుల ధైర్యశాలు ఆ గుఱములమీద తండా లుగా వెళ్ళి పక్కనున్న దేశములను దోచుకొని వచ్చుచుం డివారు. ఒక్కొ కప్పుడు మీకు నూతన ప్రదేశముల నాక్రమించి యచట నివసించుచుండెడివారు. ఆ కాలమున నింగ్లాండు దేశము గాలు దేశము న కన్నగూడ మిగుల మోటుస్థితి ముందును హీన స్థితి యందును నుండెను.

రోమనులు జయించుట


సోమకలా ఇట్టి స్థితిలో, గాలులున్నపుడు క్రీస్తుకు పూర్వము 125 రోమసులు సంవత్సరము మొదలు 50 సంవత్సరము వరకును గాలు పై రోమనులు దండెత్తిరి. రోమక సామ్రా జ్యమునకు "ఇటలీ దేశములోని "రోము”ముఖ్య పట్టణము. అప్పుడు రోమక రాజ్యము యూరపు ఖండములో ప్రసిద్ధి కెక్కియున్నది. రోమక రాజ్యము యొక్క సర్వసేనాధి పతియగు జూలియసుసీజరు గాలు దేశమును జయించుట కేడు సారులు దండయాత్రలు సలిపెను. రోమనులకును గాలులకును ఘోర యుద్ధములు జరిగెను. తుదకు గాలు దేశ మంతయు రోమను లచే జయించబడినది. గాలు దేశము రోమనుల పాలనము క్రింద క్రీస్తు' తరువాత 395 సంవత్సరము వరకును నుండెను. ఆ దేశమును రోమను ప్రభువులు పదునేడు రాష్ట్రములుగను నూటయిరువది పట్టణములుగను విభ వించిరి. పట్టణములలో మ్యునిసిపాలిటీలను నెలకొలిపిరి. పాకశాలలను స్థాపించి కళలను చేతిపనులను వాణిజ్యమును కొంతవరకు ప్రోత్సహించిరి. గొప్ప అందమైన కట్టడములను నిర్మించిరి. రోమనులు నాగరికు