ఈ పుట ఆమోదించబడ్డది

ప్రక ర ణ ము 14

77

డందురా! అట్లన వీలులేదు. తనకన్నులయెదుటనేకదా యీఘోరము ప్రవర్తిల్లినది. అతని కీపనియే నమ్మకము కానిచో వెంటనే లేచి తన పినతండ్రిని వారించియే యుండును. మీ రెంత మంచిగా ప్రవర్తించినను నతఁడు మిమ్ము నమ్మఁడు. మీయందున్న ద్వేషబుద్ధి విడువఁడు. కావున, మీరు భీమరాజుపక్షము నవలంబింపుఁడు. ఈ రాజునకును, భీమునకును గానున్న యుద్ధమున నతనికిఁ దోడు చూప నంగీకరింపుఁడు. అతనివలన గౌరవమును, సంస్థానములను బొంది సుఖముగా జీవింపుఁడు. నావచనములు నమ్ముఁడు. నా పల్కినదానియం దనృతము కొంచెమైనను లేదు. మిమ్ము వంచించుటకు రాలేదు. భీమదేవునిమనస్సు మీయం దెంత ప్రసన్నత వహించినదో యొక్కమాఱు వచ్చి చూచిన మీకే బోధపడును.

అనిపల్కుచున్న యమరసింహునివాక్యములు విని వా రధికాశ్చర్యము పొందిరి. తమతండ్రికాలమునుండియుఁ దముతో మహావిరోధ మవలంబించిన భీమదేవుఁడు తమపై నేఁ డింత ప్రసన్నత వహించుటకుఁ గారణ మేమో వారికి బోధపడలేదు. అగ్నికిఁ జల్లదనమట్లు భీమున కంతసాధుత్వ మబ్బుట యసంభవ మని వారి తలంపు. మంచిమాటలాడి తనచెంతకు రప్పించుకొని భీముఁడు తమ్ముఁ జంపునేమోయన్న యనుమానము వారిని వదలలేదు. వేఱొకచోటికిఁ బోయి వా రయిదుగురు నేమేమో కూడఁబలికికొని మరలివచ్చి 'అయ్యా!