ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకర ణ ము 13

69

కుమారి యతనిని సమీపించి నమస్కరించి యతఁడు చేసైగ చేఁ జూపిన యొక పులిచర్మము పైఁ గూర్చుండెను. రూపవతియు నా మెకు దగ్గఱగా నిలువఁబడెను.

అప్పుడు బై రాగి మంట వెలుఁగున నాయువతిహస్త రేఖలు పరిశీలించి కొంచె మాలోచించి యా మెముఖమును నిదానించిచూచి యిట్లు సంభాషించెను.

బై:– కుమారీ ! నీమనోరథము నాకుఁ దెలియవచ్చి నది. నీ వొక రాజాధి రాజును వరింపఁ దలఁచుకొన్నావు కదా?

ఇచ్చి:- అవును, నాకోర్కె నెట్ వేఱునా, లేదా ? సెలవిండు.

బై: – నీవు కోరునట్టి రాజు నీకు భర్తయగునట్లు లేదు. కాని, యతనికంటె గొప్ప వాఁడగు మఱియొక రాజు లభించును.

ఇచ్ఛి: -స్వామీ ! నేను గోరుకొన్న పురుషుఁడు లభిం పని చో నా కీజన్మముతోఁ బనియేమి ? అప్రియుఁడగు పురు షుని వరించి కష్టముల బారిఁ బడుటకంటె మరణించుటయే యుత్తమము గదా !

బై: తల్లీ స్థితిగతుల నాలోచింప నట్లుతోచుచున్నవి. ఏమి చేయుదును ! అమ్మాయి ! మఱియొక సమా చారము. నీ మూలమున మీతండ్రి రాజ్యమునకు గొప్పయుప దన మొకటి రానున్నది.

ఇచ్ఛి: - యోగీంద్రా ! తమ వాక్యము . నిజము. ఆయుపద్రవమును... దలంచుకొని యే మేమును విచారించు