ఈ పుట అచ్చుదిద్దబడ్డది

68

ఇచ్చినీ కు మారి

గుండెలను జీల్చి ముని బాలకుని మార్కండేయుని రక్షించిన దయారసము నీదాసురాలిపై , జిల్కుము. నామూలమున నాబూగడమునకు వచ్చుచున్న యుపదవముఁ దప్పింపుము. నాకోర్కు లీ డేర్పుము' అని వేఁడి మరల నమస్కరించి తత్ప్ర సాదమును స్వీకరించి మరలివచ్చి సవారీలోఁ గూర్చుండి త్రికాలజ్ఞుఁడగు 'బై రాగిదర్శనము గావించి రాఁబోవు స్థితిగతు లను దెలిసికొనఁగల్గినచో నందులకుఁ దగిన ప్రతి క్రియ నాలో చించుకొనవచ్చునని నిశ్చయించి సవారీని 'బై రాగిమఠమునకుఁ గొనిపో నియమింప నాబోయీ లట్లు గావించిరి.

ఆమఠము దేవాలయమున కెంతో దూరము లేకపోయి నను నొక మూలయం దుండుట చేఁ బ్రయత్నించి సమీపించిన వారికిఁగాని యది కంటఁబడదు. బోయీ లాసవారీని నా మఠము గుమ్మమునొద్ద దించిరి. ఇచ్చినీకుమారి దిగి రూపవతి . వెంటనంటి పోయి నెగడియొద్ద జపముగావించుకొనుచున్న బైరాగిని దర్శించెను.

అతని శరీరము విభూతిపూఁతచే మిక్కిలి తెల్లనయి. యుండెను. అవయవ పటుత్వము కొంచెమేనియు సడలినట్లు లేదు. కాని; జడలును, గడ్డమును నెజుసి ముదుసలివాఁ డని చెప్పుచుండెను. అతని శాంతరూపమును, బూడిదపూఁత చే మిక్కిలి తెల్లగానున్న శరీరమును, జటాకలాపమును జూచి తనయభిలషితములను దీర్చుటకై బై రాగి వేషమున వచ్చిన యాయచ లేశ్వరుఁడేమో యని 'సం దేహించుచు . నా రా