ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము 12

57


డును, నపార సేనాసమేతుఁడును నాభీమునివలనదమకు రానున్న దుర్ని వార్యము లగునాపదలఁ దలంచుకొన్నపుడు విచారమును గూడ నొందక పోలేదు. భీముఁ డచిరకాలములోనే తమపురమును ముట్టడింపకమానడనియు నాతనిఁబోఱఁద్రోలి యీబూగడమును రక్షింపఁ జాలినశ క్తితమకు లేదనియు నా మె యెఱుంగును. తనతండ్రి రాజ్యమునకును,దనబందుగులకును దనమూలమునఁ దీఱనికష్టము సంభవించుచున్నందుల కామె యొక్కొక్కపుడు చెందుచున్న దుఃఖమునకు మేరయే లేదు. ఆమహాపదను దప్పించుకొనుటకు రెండే మార్గములు. భీమ దేవునిఁ బెండ్లియాడుట యొకటి , రెండవది, తమపై నెత్తి వచ్చిన భీమ దేవు నెదిరించి పాజఁద్రోలఁజాలు బలవంతు నాశ్రయించుట. ఇం దేదియు క్తము ? అన్నివిధముల దనకుఁ బ్రతికూలవ ర్తనుఁ డగువానినిఁ జేపట్టియావజ్జీవమును దనజన్మమును దుఃఖభాజనము గావించుకొనుట యుక్త మా ! కాదు. అంతకంటె వెంట నే ప్రాణ త్యాగము చేసి తానుసుఖించి తన వారిని సుఖంపఁ జేయుటయేమేలుక దా!

కాని, యాత్మహత్య సజ్జనగర్జితము కావునమొదటి పక్షము చేకొనఁదగినది కాదు. ఇక, రెండవపక్ష మాలోచించిన నదియు సంఘటించునట్లు లేదు.భీమ దేవు నెదిరించి తమ్ముఁ గాపాడఁజాలు బలవంతుచెవఁ డున్నాఁడు ? అక్కాలమునఁ బృథ్వీరాజుతప్ప వేఱొక్కడతని నెదుర్కొన లేఁడు. కాని, పృథ్వీరా జందుల కంగీకరిం