ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

ఇచ్చ్నీకుమారి


మును జూర్ణగా గా వించుచుబోయిజూర్ణ ముగావించుచుఁయాబూగడమును ముట్టడించుఁగాక ! మనవీరుల సింహనాదము చేతను, ఏనుఁగుల ఘీంకారములచేతను ఆబూగడములోని యతఃపుర మందిరములు రాఁబోవునాపద కేడ్చుచున్నట్లు ప్రతిధ్వనులు చేయుఁగాక ! అని యిట్లు కోపా వేశము చే నొడ లెఱుఁగక పలుకుచుండ సమరసింహుఁ డతని కిట్లనియె. 'దేవా ! తామింతయాగ్రహము చూపనవసరము లేదు. పరమారునిమాటలతో మనకుఁ బ్రయోజనమేమి ? అతని రాజ్యలక్ష్మిని మన మాసింప లేదు. కావునఁ, బోరుసల్పి యాబూగడమును జయించుటకుఁ బ్రయత్నింప నేల ? ఇక్కార్యమును సాధింప దండోపాయముదక్క వేజు పాయములు లేవా ! ఏవిధినై న మీరిచ్ఛినీకుమారిని బెండ్లియాడినఁ జాలును, అదియే మనకు ముఖ్యకార్యము, ఈస్వల్ప కార్యమున కంత ప్రయత్నమా ? గోళ్ళతో జీల్చు దానికి గొడ్డళ్ళేల ! కావునఁ, దమరు కొంచెము శాంతివహించి యుండుఁడు. సర్వమును జేసెద' అని పల్కి. యప్పటి కతని యుద్రేకము తగ్గించెను,

పదనొకండవ ప్రకరణము

అభయసింహుని ప్రయత్నములు

జై తపరమారుఁడు తనకూఁతు నియ్య నని చెప్పి భీమదేవుని సం దేశము నిరసించి నప్పటినుండియు సభయసింగుని