ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్ర క ర ణ ము 7

37



జేయ నీపరమారుఁ డంత బుద్ధిహీనుఁనుఁడు కాఁడు. భీమరాజు పరాక్రమవంతుఁడు; అఖండ సైన్యముగలవాఁడు. విస్తారమగు రాజ్యముగలవాఁడు. చాళుక్యవంశము లోకమునఁ బ్రసిద్ధి గాంచినది. అట్టివానికి నాకూఁతు నర్పించుట కెంతయో సంత సించి యుందును. నీ జై నసంబంధము చేఁ దన్నును దనవంశమును గలుషితము గావించుకొన్న యారాజునకు నాకుమారి నే ట్లిత్తును ? పోయి యీవృత్తాంతము నీ ప్రభువునకు విన్న వింపుము.”

అమరసింహుఁ డావచనములు విని ‘రాజేంద్రా ! అథ్లె విన్నవించెదను. కాని, తమ రతనికోర్కిని దీర్పని చోఁ జెప్పుమన్నవి కొన్ని మాటలు మిగిలియున్నవి. మీ రతనికి విరుద్ధముగా నడవనున్నారు.. కావున, నావచనములు తెలియఁ జెస్పెదను. 'ఓరాజా ! నీవు నాకోర్కిని విఫలముగావించితి వేని నీ రాజ్యమున కకాలప్రళయము సంభవించిన దని యెఱుం గుము. భీముఁడు మయిమయిఁ బోవువాఁడు కాఁడు. అపార సైన్యములతో వచ్చి రెండునిముసములలో నాబూగడమును మంటఁగలిపి, మిమ్ముల నవలీల జయించి; విజయలక్ష్మితోను, నాబూగడ రాజ్యలక్ష్మితోను నీకూతును వరింతును. శత్రు వులపాలిట ప్రళయకాలయమునివంటి భీమ దేవు నెదిరించువాఁ డెవ్వఁడో చూచెదనుగాక!' అని పల్కుచుండఁగనే పర మారుడు మిగుల గోపోద్దీపితుడై 'ఓయీ! జైతపర మారుఁడు మీ రాజువీరాలాపములకు జంకెడి పిఱికిపంద గాఁడు.