ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణ ము -27

161

21] ప్రకరణ ము -27 161 యన్డిలపురమునకుఁ బోయిన ట్లింటివారు చెప్పి'రని మనవి చేసెను. భీమదేవుఁ డది విని 'భూయాదుఁడు శత్రువులలోఁ జేరి యున్నాండని నిశ్చయించి వారినంద ను బంపి వేసి రూపవతిని జూచి 'సుందరీ ! నీకుఁ బెద్ద కష్టము సంప్రాప్త మైన ' దని పల్కెను.

రూ: మహారాజా ! ఇచ్ఛినిని మోసపుచ్చికొని వచ్చి నందుల కిది ప్రతిఫలము. ఫలమును దెచ్చి నోటిముందుంచి నను దేవరవా రనుభవింప లేకున్నారు. ఇచ్ఛినిని దీసికొని వచ్చుటవలనఁ గష్టము తప్ప మజేమియును ఫలము లేక పోయెను.

భీ: మరి న న్నేమి చేయుమందువు ?

రూ: రాజేంద్రా ! నీ వా మెను బాధింపవ లెను. లేనిచో నామె నీకు లోంగదు.

విని భీమ దేవుఁడు కొంచెము యోచించెను. రూపవతి చెప్పిన యుపాయమే యుచితముగా నున్నదని నిశ్చ యిం చెను. అతఁడు రూపవతి నింటికిఁ బుచ్చి వెంట నే లేచి యాయుధమును దాల్చి యిచ్ఛినీకుమారి భవనమువంక నడవ 'సాగెను. ' అట్లు పోవునపుడు భీమ దేవుఁడు 'నాఁ డెంతటి ఘోరకృత్య మొనరించియైనను నా రాజకుమారిని వశపఱచు కొనిఱవ లె' నని నిశ్చయించుకొనెను. అతఁడు సరభసగమన ముతో నొకనిముసములో నిచ్ఛినిభవనమును, జేరెను, కాని,