ఈ పుట అచ్చుదిద్దబడ్డది

120

ఇచ్చనీ కుమారి

తతోఁ గాచుచున్నాము. ఈ వృత్తాంతముఁ దెలిసి పరమారుఁడు సై న్యసమేతుఁడై నచ్చి దీనిని ముట్టడించు నేమో యన్న భీతి వొడముచున్నది. కావున, మీరు సేనాసమేతులై త్వరగా వచ్చి యీ పురినిగాపొడి రాజకుమారిని వరింతురుగాక ! నే నీదినమున నే రెండవ కార్య మాచరించుటకు ఢిల్లీ కిఁ బోయి మన వారితో మాటాడి వ చ్చెదను. దానినిగూడ సులభము గా నే నెఱ వేర్చి వత్తును. ఈమధుమంతుఁ డిచ్ఛినీకుమారిని గొనివచ్చుటలో మిక్కిలి తోడుపడిన వాఁడు గాన నితనికి రెండు వేలరూకలకుఁ దక్కువ కాకుండ బహుమానము చేయఁ గోరుచున్నాను. మీ రతిశీఘ్రముగ నే మధుమంతమునకు వత్తురుగాక !

ఇట్లు,

భవన్మిత్రుఁడు, అమర సింహుఁడు.

పరమారుఁ డాయు శరవృత్తాంత మరసి యిచ్చిని మధుమంతమున నున్నట్లు విని యానందించుచుండ నీశ్వర భట్టు లేచి యొక ముత్యాలహారము నతని కిచ్చెను. జై తుఁడు దాని నందుకొని యెగాదిగ చూచి యీశ్వర భట్టుతో ఓయీ! ఇది మాయిచ్ఛినీకుమారిది. నే నామె నిమిత్త మతి ప్రయత్నము చేసి యీ పెద్దము త్తెములు సంపా దించి యపూర్వపద్ధతినీ దీనిఁ గట్టించితిని, ఇది నీ కెక్కడ లభించె నని యడుగ నతఁడు చేతులుజోడించి 'మహారాజా