ఈ పుట అచ్చుదిద్దబడ్డది

116

ఇచ్చనీ కు మారి


బ్రాణములు విడుచుటకు సిద్ధముగా నున్న సమయమున వీరు వచ్చి నాకట్లు విప్పి నాయాఁకటిని దీర్చి బ్రతికించిరి. “రా జేంద్రా ! ఆ బై రాగియు, రూపవతియుఁ గలసి మోసము చేసి యా రాజకుమారి నెచ్చటికో గొనిపోయినారు. దుష్టు రాలగు రూపవతియు నాధనమంతయు లాగికొని తుదకు నా కెట్టియవస్థ గల్గించినదో చూడుఁడు. నేను జేసినయపరాధమును సైఁపుఁడు' అని ప్రార్థించెను. పరమారుఁ డది విని యం దతనియపరాధ మేమియు లేక పోవుట చే నతని క్షమించి 'ఓ యభయసింహా! నీ వాబై రాగిని, రూపవతినిఁ గూడ బాగుగా నెఱుఁగుదువు. కావున, నీవు స్వస్థుఁడ వైనపిమ్మటఁ బోయి వారిజాడ లరయు' మని చెప్పి యింటికిఁ బంపి వేసెను. అది మొద లభయసిం హుఁడు రూపవతీని, బైరాగిని బట్టుకొనుటకై ప్రయత్నము సలుపుచుండెను.

ఇరు వ ది య క ట వ ప్రకరణ ము

ఈ శ్వర భట్టు

ఇచ్ఛినీకుమారి వృత్తాంత మరసివచ్చేద " నని చెప్పి పోయిన యభయసిం గింకను రాక పోవుట చేఁ బరమారుఁడు సంతతవిచారముచే దిగులొంది యతికష్టము చేఁ గాలము గడపుచుండెను. తనకూతును మోసపుచ్చి కొనిపోయిన దురాత్ముఁ డెవఁడో తెలిసిన చో నొక క్షణమున నే వానిని