ఈ పుట అచ్చుదిద్దబడ్డది

112

ఇచ్చి నీ కు మారి

ఎదు అట్లయిన నీ వెన్నటికిని నిందుండి విముక్తి జెంద లేవు. నీ విం తేనియు సుఖంప లేవు.

ఇచ్చి: ——విముక్తి లేకున్నఁ బోనిమ్ము, నాహృదయము నందున్న నాపతిని నారాధించుకొనుచు సుఖముగాఁ గాలము గడి పెదను.

భీ: బల్మిని వరించిన నేమి చేయుదువు ?

ఇచ్ఛి: — ఉత్త మస్త్రీలను బలాత్కరించిన వారిగతియే నీకును బట్టును.

భీముడా వచనములు విని పక పక నవ్వుచు 'ఓ వెర్రి దానా ! మంచిమాటలచేఁ దప్పించుకోనిపోవ లె నని తలంచు చున్నావు. భీమ దేవుఁ డంత యమాయికుఁడుగాఁ' డని పలికి రూపవతితో నచ్చోటు గదలిపోయెను.

ఇరు వ ద వ ప్రకరణము

ఆబూగడము - అభయసింగు

రూపొందిన రాజ్యలక్ష్మివలెఁ దన భవనమునఁ జరిం చుచుఁ దన సత్ప్రవర్తనము చే నెల్ల రహృదయముల కానం దముఁ గోలు పుచుఁ దన చతురవచనముల చేతను, యుక్తుల చేతను యుక్త సమయములఁ దండ్రికిఁ దోడుపడి యతనివలన నెక్కుడు గౌరవము చెందుచునుండు నిచ్ఛినీకుమారి మాయ మైనప్పటినుండియు జై తపరమారుఁడు రేయింబవళ్ళు దుఃఖిం