ఈ పుట ఆమోదించబడ్డది

ప్ర క ర ణ ము 19

107

మేల్ముసుఁగు నొకించుక యొత్తిగించి నీకడకంటిచూపులచే నతనిఁ దానమాడించి యతనిఁ గృతార్థునిఁగాఁ జేయుము. అమ్మా! నీవు చక్కఁగాఁ బరిశీలింపుము. ఈ రాజువంశ మాక్షత్రియకులములలో నుత్తమమగు చాళుక్యవంశము! ఇతనిరాజ్యమా యనంతమైనది! పరాక్రమమా, శత్రురాజులను గడగడలాడింపఁజాలినది! సైన్యములా సముద్రమువలె నతిభయంకరమైనవి! సకలసంపదలకు నిధియగు నీతని వరించుట కేల సంశయింతువు! తల్లీ! నామనవి వినుము. ఇతరుల కెవ్వరికిని లోఁబడక వీరాధివీరు డనిపించుకొనియున్న యీరాజకుమారుని ఘూర్జరరాజ్యలక్ష్మితోఁగూడ నీదాసునిగా నేలుకొమ్ము' అని పలికెను.

రూపవతి మాటలాడుచున్నంతసేపును భీముఁడు ఱెప్ప వాల్పకుండ నారాజకుమారినే చూచుచుండెను. అంత మృదువుగా, నంత మధురముగా, నంత సరసముగా, నంత చమత్కారముగా, నంత వినయముగాఁ బలికిన రూపవతివాక్యముల కామె యేమి సమాధానము చెప్పునో యని యతఁడు కనిపెట్టుకొని యుండెను.

త న్నన్యాయముగా మోసపుచ్చి తెచ్చి యిట్టి యిక్కట్టులపాలు గావించిన రూపవతి కంటఁబడినప్పు డిచ్ఛినికిఁ బొడమినకోపమునకుఁ బారము లేదు. ఆకోపాగ్నికి దానిప్రసంగ మాజ్యధార యగుడు నాకుమారి యిఁక సహింపలేక తనయెదుట మోఁకరించియున్న రూపవతిగుండెలపై గాలితో