ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

21

“మీయాజ్ఞఁ దలమోచి మెయికొని పనులు
సేయుదు నన్నింత సెప్పంగ నేల ?
మర్త్యలోకమునకు మఱి వేఱె యొకఁడు
గర్త యున్నాఁడె లోకత్రయవరద !
ఇం దున్న నేమి ? నా కం దున్న నేమి ?
యెం దున్న నేమి ? నీయండ నాయునికి "
అని విన్నవించిన యానందికేశు
వినయోక్తులకు జగద్విభుఁ డిట్టులనియె :560
“గురులింగమూర్తిఁ జేకొని వచ్చి యేన
పరమతత్త్వార్థతత్పరుఁ జేయువాఁడఁ ;
బ్రాణలింగంబ నై భ్రాజిల్లి నీదు
ప్రాణాంగముల నొడఁబడి యుండువాఁడ ;
రూఢిగా జంగమరూపంబుఁ దాల్చి
వేడుక నినుఁ గూడి విహరించువాఁడఁ;
దసుమనోధనములు [1]దారవోకుండఁ
దనుఁ జేర్చికొనువాఁడ ననఁగి పెనంగి ;
నా ప్రాణములకుఁ బ్రాణం బగుచున్న
నా ప్రమథులకుఁ బ్రాణం బగు నీకు 570
నాకును సం దొక్కనాఁడు లేకునికి
నీకుఁ దెలముగాదె లోకపావనుఁడ !"
అని యూఱడిలఁ బల్కు నాశంకరునకుఁ
దనువెల్లఁ జేతు లై తా మ్రొక్కి నిలిచి
“విన్నపం బేఁ బనివినియెద" ననుచు
న న్నందికేశుఁడు సాష్టాంగ మెరఁగి
ప్రమథసన్నిహితుఁ డై భ్రాజిల్లు శివుని
నమితతేజోమూర్తి నాత్మలో నిలిపి
నరలోక మల్లదె నా నింతనంత

  1. వ్యర్థముగాకుండ.