ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xxvi

ఋణవిముక్తుఁ డైనాఁడు సోమనాథుఁడు. జన్మచే నీతఁడు బ్రాహ్మణుఁ డయ్యు నూతనముగాఁ దెలుగునాట వ్యాప్తినొందిన వీరశైవమతమునం దనురక్తుఁడై తన్మతదీక్షను గైకొని వీరమాహేశ్వర వ్రతాచారుఁ డైన్లటు కానవచ్చుచున్నాఁడు. “పాశముక్తుండ కేవల భక్తిగోత్రుండ"నని తన కులగోత్రపాశవిముక్తిని, శైవభక్తి పారవశ్యమును బ్రకటించు కొనినాఁడు. ఈతని కామతమునం దంతభక్తి కుదురుటకు సమీపగ్రామమునందున్న కట్టకూరి పోతి దేవర ప్రబోధము కారణ

మైయుండవచ్చును. అందువలననే "ఖ్యాత సద్భక్తి మైఁగల కట్టకూరి, పోతిదేవర పదాంబుజ షట్పదుండ" నని చెప్పుకొనినాఁడు. అతనికి దీక్ష నిచ్చి దివ్య పునర్భవమును ప్రసాదించిన గురువర్యుఁడు గురు లింగార్యవరుఁడు. అటనుండి యతనికి గురువే తండ్రి. అతని కరమే జన్మస్థానము. కావుననే “శరణాగతాశ్రయ సకలస్వరూప-గురులింగవర కరోదర జాతుండ"[1]నని వినమ్రుఁడై చెప్పుకొనినాఁడు. అతని భక్త్యావేశమే యతనిలోని కవిత్వావేశమును మేల్కొల్పినది. అట్టి తరుణమున కరస్థలి విశ్వనాథయ్యగారి సాన్నిహిత్యము, శిష్యత్వము లభించుటయు నతనివలన ప్రకట వరప్రసాద కవిత్వయుతుఁ డగుటయు సంభవించినది. కవితామధు వాని సహజసంగీతశాస్త్ర పాటవముతో నూత్నభక్తి గీతము లాలపించుచున్న సోమనాథుఁడు కవికోకిల యై చెన్నరాముఁడు, గోడగి త్రిపురారి మొదలగు భక్తుల సంభావనకు పాత్రుఁడై , వారికి ప్రాణస్నేహితుఁడు కాఁగలిగినాఁడు. ఆ పైన భక్తకారుణ్యాభిషిక్తుఁ డైనాఁడు. అతనియందు భక్తియు, కవితయు, మతాచార సంపత్తియుఁ బరిపక్వదశ నందుటకు పెద్దకాలము పట్టియుండదు. అంతట 'భవిజన సమాదరణ సంభాషణాది సంసర్గదూరుఁ డై నిర్మలచరిత్రుఁ డని వాసి కెక్కెను. సహజపండితుఁడైన సోమనాథుఁడు శైవాగమధర్మశాస్త్రములను పుక్కిట పట్టి పరమ విజ్ఞాని యై వెలుఁగొంది

  1. బ. పు. (సంక్షిప్తము.) 1. 148 - 149. ఇట్లు ఇట్టి గురుప్రశంస పండితారాధ్య చరిత్రమునందును గలదు: “పేరెన్నఁబడిన శ్రీబెలిదేవివేమ - నారాధ్యులను పరమారాధ్యదేవు-మనుమని శిష్యుండ”. ఇచ్చట మనుమఁ డనఁగా అచార్యవంశమున మనుమఁడని భావించి "ప్రశిష్యు”నిగా గ్రహింపవలెనని కీ|| శే|| వే. ప్రభాకరశాస్త్రిగారు బ పు. పీఠిక పు. 14. 'గురులింగ'ము సంజ్జికాదనియు గురువనులింగమనియు శ్రీ బండారు తమ్మయ్యగారు, దీనిని శ్రీ చాగంటి శేషయ్యగారు ప్రత్యాఖ్యానించిరి. (చూడు: కవితరం. 3 సం. 95-96) అనుభవసారమున జెప్పిన గోడగి త్రిపురారి దీక్షాగురువగు గురులింగమే సోమనాథుని దీక్షాగురు వని వారు తలంచిరి.