ఈ పుట అచ్చుదిద్దబడ్డది

236

బసవపురాణము

బోయి “యుత్పాతము ల్వుట్టె నీపురిని
శ్రీకంఠశివులు గౌరీనాథశిపులు
లోకేశశివులు ద్రిలోచనశివులు
నీశానశివులు మహేశ్వరశివులు
పాశ మోచనశివు ల్వరమాత్మశివులు
శాశ్వతశివులు గణేశ్వరశివులు
విశ్వేశశివులుసు విమలాత్మశివులు 260
త్రిపురాంతకశివులు ద్రినయనశివులు
ద్వితదైత్యహరిశివు ల్దేవేశ శివులు
నురులింగశివులును నుగ్రాక్ష శివులు
హరశివులును బరమానందశివులు
ధర్మశివులును విద్యాధరశివులు
నిర్మలశివులును నిష్కలశివులు
మొదలుగాఁగల శైవముఖ్యు లందఱును
నిది యేమి మతములో యెఱుఁగంగరాదు !
బసవయ్యతోయంపు భక్తులఁ జూచి
వసుధఁదారును లింగవంతుల మనుచు 270
దొడఁగి ప్రసాదంబుఁ గుడుచుచున్నారు ;
నడరఁగ మా కించు కైనను నిడరు.
నియ్యూరిలో మల్లజియ్యము బొల్ల
జియ్యయు నిత్తురే ? చెల్లునే యిట్లు ?
విను మహారాజ ! మావృత్తి నిర్మాల్య :
మొనరఁగ మాకు వచ్చినతొంటి విధము
పసులఁ గావఁగఁ బోయి బాలుఁడు దొల్లి
యిసుకలింగముసేసి యేలమిఁ బైఁ బిదుక
నేలరా ! మొదవుల పాలెల్ల నేల
పాలు సేసెద వంచుఁ గాలఁ దన్నుఁడును 280
గడఁగి తండ్రి యనక గ్రక్కునఁ గాళ్లు
గడికండలుగఁజేసి మృడుని మెప్పించి