ఈ పుట అచ్చుదిద్దబడ్డది

224

బసవపురాణము

వరగొండ పెరుమాణి నరులెల్ల నెఱుఁగఁ
గర మర్థిఁ గొనిపోఁడె కైలాసమునకు ?
మ్రోలఁ బాడఁగఁ దాళములతోడ నంబిఁ
గై లాసమునకు శంకరుఁడు గొంపోఁడె?
యెలమి షోడశగణముల నిరతముగ
వెలయఁ బీఠంబుల నిలుపఁడే ? మఱియు
తేరసగణముల వీరసద్భక్తి
గారవించుచు మెచ్చి కరుణించెఁగాదె ? 750
పొంచి మృగార్థియై పొరి నిద్రవోని
చెంచున కొసఁగఁడే శివరాత్రిఫలము ?
చన్నసద్భక్తులచరిత లనంత
మెన్న నే ? లిపుడు నీ వెఱుఁగంగ శివుఁడు
వసుధఁ బేర్కొను మడివాలుమాచయ్య
యసదృశుఁడగు కిన్నరయ్య యాదిగను
నచ్చుగా భక్తుల కభిమతఫలము
లిచ్చుచు నున్నవాఁ డిట్లు గావునను
గంతుసంహరు కెన గలదనుచదువు
లింతయు శివుఁ డను నేకాత్మమతము 760
విను "యథాశివమయోవిష్ణు" వన్మాట
లును, ద్రిమూర్తులు నొక్క టనుదురుక్తులును
అష్టమూర్తులు రుద్రుఁ డనుకుయుక్తులును,
దుష్టమానవుల భక్తుల కెన సేసి
పలుకుటయు వినంగఁ బాతకంబొందుఁ ;
గలదేని పనిసెప్పు పిలిపించి" తనుడు
భూములు సూచుచు మోములు వాంచి
గామడ్చినట్టు లంగంబులు మఱచి
యుక్కఱి స్రుక్కి యయ్యూరువు లుడిగి
నక్కిళ్లు పడి గ్రక్కు మిక్కన లేక 770
యున్నవారలఁ జూచి యుత్తరం బడిగి
యన్నరేంద్రాధముఁ డట్లు లజ్జింపఁ