ఈ పుట అచ్చుదిద్దబడ్డది

200

బసవపురాణము

“నితనిఁ జంపుట యిది యెంత దలంపఁ ?
బ్రతినఁ జూపమి భక్తి పతంబుగాదు ;
శిరమిత్తుఁ బడయుదు జినసమయంబు ;
శిరము ద్రుంపుదు బాసఁ జెల్లింతు." ననుచు
శ్రీకంఠుభక్తికిఁ జేవ యెక్కంగ
నేకాంతరామయ్య యి ట్లని పలికె ;
“శిర మిచ్చి పడయుట యరిది యంటేనిఁ
బరవాది వినుర మాభక్తు లమహిమ: 60
యొక్క భక్తుండు జంబూర్మహాకాళుఁ
డక్కజంబుగ శిర మభవున కిచ్చి
యిలయెల్ల నెఱుఁగంగ నెలమితోఁ బడసెఁ
దల నట్టతోఁ గీలుకొలిపి ప్రాణంబు ;
అట వార్తగలిగి యీ కటకంబునందుఁ
బటుమతి గోవిందభట్టారకుండు
శివునినిర్మాల్య మిచ్చిన మస్తకంబు
తవిలిచికొను టిది దప్పు దప్పనుచుఁ
గఱకంఠునకుఁ దలదఱిగి పూజించి
నెఱయ మూన్నాళ్ళకు మఱియొండు శిరము 70
వడసె ; వెండియు నొక్కభక్తుఁ డిట్టిదియుఁ
గడు నపహాస్యంబుగాఁ బ్రతిష్ఠించి
మూఁడుదినంబులు ముక్కంటి యచట
లేఁడొ తా. జచ్చినవాఁడొ కా కనుచు
మొఱటద వంకయ్య యఱిముఱి శిరము
తఱుగంగ మొలవఁగఁ దఱుగఁగ మొలవఁ
దఱిగెడు తలలును దఱుఁగని భక్తిఁ
దఱుఁగమిగాఁజేసి తదవసరమునఁ
బూన్చెడి శిరమును బూన్పనిశిరముఁ
బూన్చినపిమ్మటఁ బుచ్చెడు శిరము 80
మొలచెడు శిరమును మొలచిన శిరము