ఈ పుట అచ్చుదిద్దబడ్డది

190

బసవపురాణము

లోరగించుచు మలయుచు వంగికొనుచు
నూఁకర ల్వెట్టుచు నురవడింపుచును
మూఁకకు నెగయుచు ముస్సుముస్సనుచుఁ 800
జవుడయ్యఁ జూచుచు సంతసిల్లుచును
దవులంబు సేయుచుఁ దపసి వెన్కొనుచు
బాసికంబును నాఁటి పసపుటక్షతలు
నా సమంచితనుగంధాను లేపనము
లొనరంగ వింతచె న్నొలయంగ గంట
లును మువ్వలును గజ్జెలును మ్రోయుచుండ
నంతంతఁ దనరారి యాలఱేఁ డుండ
సంతోషమున ముస్డిచౌడరాయండు
బడిసివై చుచుఁ జేరి మెడఁ గౌఁగిలించి
యడుగులు గడిగి పుష్పాంజలు లిచ్చి 810
యాయతధూపదీపాదు లొనర్చి
నేయుఁ బాలును బొట్టనిండ వడ్డించి
“నడువుము నడువుము నందెన్న ! నీవు
నడవ కేఁబెండ్లి కి నడవ నిక్కంబు"
అనవుడు లోకంబు లచ్చెరువంది
వినుతింపఁ దద్భక్తజను లుత్సహింప
నందఱ ముందఱ నరుగు నత్తపసి
ముందఱ నాఁబోతు మురియుచు నడవ
నరుగఁగ నరుగఁగ నంత ముందఱను
నురవడి నుప్పొంగి యుడువీథి దాఁకి 820
హిద్దొర యనునది యిల నిండిపాఱఁ
దద్దయు నుద్వృత్తి ధరఁ దన్ని నిలిచి
“యెఱుఁగవే వారాసు లెల్ల నొక్కయ్య
యఱచేతిలోనన యణఁగుట మఱియు
భవి పుట్టి యొల్లక భువి ముదలింప
సవిశేషభక్తప్రసాది దాసయ్య