ఈ పుట అచ్చుదిద్దబడ్డది

182

బసవపురాణము

యతివిస్మయాక్రాంతమతిఁ జిట్టమిడిచి
గతకోపుఁ డై క్షితిపతి యిట్టు లనియె
"నెక్కడిపసిఁడిప్రో వెక్కడి దొంగ
యెక్కడికన్న మి దేమి వన్నితివి? 570
బసవనమంత్రి ! యేర్పడఁ జెప్పు"మనిన
వసుధేశునకు బసవనమంత్రి యనియె :
"భక్తుండు గన్నదబ్రహ్మయ్య నాఁగ
వ్య క్తలింగం బనియుక్తప్రతాపి ;
కస్నద బ్రహ్మయ్య గారిమహత్త్వ
మెన్నఁగ శక్యమే యీశునకైన ?
నాతని శ్రీచరణాంగుష్ఠయుగము
ఖ్యాతిగాఁ గల్పవృక్షములకు నూఁత ;
యామహాత్మునియమృతావలోకనము
కామధేనువులసంఘముపుట్టినిల్లు : 580
చింతింప నాతనిచిత్తంబుచిగురు
చింతామణులకు నిరంతరాశ్రయము ;
అరయంగ నతనిహస్తంగుళస్పర్శ
విరచింపఁగాఁ బర్సవేదులగనులు ;
నతనిశ్రీపాదసంగతి ముక్తి భూమి ;
యతని ప్రసాదంబు నమృతంబుతేట ;
యతనికోపంబు సంహార కారణము;
నతనికారుణ్యంబ యపవర్గ మింత ;
నణిమాదిసిద్ధులు నాతనిబంట్లు :
గణుతింప నింత లింగసదర్ధుఁ డయ్యుఁ 590
బట్టిననియమంబుఁ బాయక కన్న
పెట్టినర్థమెకాని ముట్టఁడు సేత ;
“నిది గుమార్గము ; భక్తి యే ? ' యన వలదు ;
ఇదియె తా సన్మార్గ ; మెట్టు లంటేని
యిలఁ జూదమునఁ బాండవులు భ్రష్టులైరి ,