ఈ పుట అచ్చుదిద్దబడ్డది

126

బసవపురాణము

బక్షద్వయము సాఁగఁ బడియున్నఁ జూచి 1370
యయ్యవసరమున నమ్మల్లి కార్జు
నయ్యగా రంతఁ బ్రహసితాస్యుఁ డగుచుఁ
దనతొంటిభావంబుఁ దాల్చి "నీమనసుఁ
గనుఁగొని నిట్లైతి" ననుచు మాదాఖ్యు
“లెమ్మ"ని చెయి సాఁచి లేవంగ నెత్తి,
క్రమ్మఱ నందంద కౌఁగిటఁ జేర్చి
“యిట్టి సాహసి వౌదువే మమ్ముఁ జూడ
నెట్టయా వచ్చితి విచ్చటి ? " కనుచుఁ
దననివాసస్థానమునకుఁ దోడ్కొనుచుఁ
జని, యంత లింగావసరము సేయించి 1380
తనప్రసాదము పెట్ట యనుపమతత్త్వ
జనితానుభవసుధావనధిఁ దేల్చుచును
గొంత వ్రొద్దట యుంచుకొని యుండి “యింకఁ
గొంత కాలము గ్రియాభ్రాంతిమై ధరణి
నుండఁగ దగు" నని యురుతరకీర్తి
మండితసద్గురు మల్లి కార్జునుఁడు
నానతి యిచ్చుడు నమ్మాదిరాజు
“తా నెట్లు వోవుదు నానందమూర్తి
తగు నిఱుపేద నిధానంబుఁ గాంచి
దిగవిడ్చి యేఁగునే మగిడి కూలికిని ? 1390
కంటి మీశ్రీపాదకమలంబు లేను
మంటి; నింకేటికి మగుడుదు?" ననిన
మెల్లన నవ్వుచు మేలు గా కనుచు
మల్లికార్జునుఁడు సముల్లాసకీర్తి
నిత్యస్వరూపవినిశ్చితం బైన
ప్రత్యయంబుల నొడఁబఱపఁగఁ దలఁచి
“యట్లేని ర " మ్మని యట యొక్కదుమ్మ
చెట్టు గావించి, “నిశ్చింత సమాధి