ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

125

నప్పుడు శ్రీగిరి కరుదెంచి రర్థిఁ
జొప్పొరు మల్లరసును జూచువేడ్క :
రయ మందఁగా మాదిరాజయ్యగారు
క్రియ దులుకాడ నగ్గిరి శృంగములను *
దనరి యొప్పెడు బిల్వవనమహత్త్వంబు
గని వినుతింపుచు వనమధ్యమందు
వినయస్థుఁ డై తన్ను వెదకుచు వచ్చు
“ననఘుని మాదిరాజయ్య మనంబుఁ
జూచెదఁగాక " యంచును మలికార్జు
నాచార్యుఁ డపరిమితాంగంబుఁ దాల్చి 1350
తెరువున కడ్డ మై దివియును భువియుఁ
బరిపూర్ణ ముగఁ జాఁగఁబడి యున్నఁ జూచి
“పరమయోగీంద్రుఁడో ? భసితంపుగిరియొ ?
ధరఁ బడ్డ రుద్రాక్షధరణీరుహంబొ ?
సదమలజ్యోతియో ? శంభురూపంబొ ?
విదితచిదబ్దిసముదితపూరంబొ ?
యేచ్చోటఁ బోవరా దెట్లొకో " యనుచు
నచ్చెరు వంది మాదాఖ్యుఁ “డీక్రమము
నరయుదు" నని యుత్తమాంగంబు దిక్కు
పరిగొని మూఁడేడు లరసికానకయుఁ 1360
బదపద్మములమీదఁ బడ కిటువచ్చు
టిది దప్పు దా నంచుఁ బదపడి మగిడి
యచ్చోటనుండి యయ్యడుగులదిక్కు
గ్రచ్చర వర్షాష్టకమునకు వచ్చి
యంత భయభ్రాంతుఁ డై “నీదురూప
మంత సూపక యేలయా యిటు లేఁప;
నే నెంతవాఁడ నిన్నెఱిఁగెద ననఁగ
నానందమూర్తి! నీయడుగులు సూపి
రక్షింపవే !" యని ప్రస్తుతింపుచును