ఈ పుట అచ్చుదిద్దబడ్డది

118

బసవపురాణము

మిట్టి మహత్త్వంబు నెందును గలదె ? 1140
విందుమే యవికలవేదశాస్త్రములఁ
గందుమే మూఁడులోకంబులఁ దొల్లి ?
బాపురే 1 కన్నప్ప : పరమ లింగంబ !
బాపురే ! కన్నప్ప : ప్రమథవిలాస !
నల్ల వో ! కన్నప్ప , నాలింగముగ్ధ !
నల్లవో ! కన్నప్ప : నల్లనై నార ! " "
యనుచు ని ట్లాతపోధనుఁ డతిభ క్తి
వినుతింప, నుమబోటి విస్మయంబొందఁ
గన్నప్ప శివుఁడు నాకంక్ష నొండొరులఁ
గన్నులఁ జూచుచు నున్న యత్తఱిని 1150
దవిలి యొండొంటితోఁ దగునన దొరపి
నివిడి యొండొంటితో నిద్దమై బెరసి
చూపులు సూపుల లోపలఁ జొచ్చి
యేపార నేక మై యెంతయు నొప్పి
కన్నప్ప దేవుని కన్నుల సఖులొ !
యన్నీలకంధరు కన్నుల కవలొ ?
తవిలి కన్నప్ప కన్గవ దర్పణములొ ?
భవునయనంబుల ప్రతిబింబ యుగమొ ?
నెమ్మిఁ గన్నప్ప నేత్రమ్ములపాయ
గొమ్ములో ? శివునేత్రగుప్తాంకురములొ ? 1160
రమణఁ గన్నప్ప నేత్రముల బీజములొ ?
యమృతాంశుశేఖరు నక్షి ఫలములొ ?
యనఁగఁ గన్నప్ప దేవునిలోచనములు
మనసిజహరుని లోచనము లై శివుని
కన్నులు గన్నప్ప కన్ను లై యిట్లు
సన్నుతి గడచి సమున్నతస్ఫురణ
నాల్గుఁ గన్నప్ప నై నారినేత్రములొ ?
నాల్గు నీశ్వరునయనంబులో యనఁగ