ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

103

బాలుండ ! నీమీఁదఁ బ్రాణము ల్విడుతు. " 710
నని తనశిరమున కలుగ నున్నంతఁ
దనతల్లి కడుపు ప్రత్యక్ష మై నిలిచి,
“యడుగు బుచ్చెద నీకు నభిమతం" బనుడుఁ
“గొడుక ! నాకొక కోర్కి, కొఱఁతయుఁ గలదె ?
నీపు నిరోగి వై నిత్యుండ వై సు
ఖావాప్తి నుండు నా కంతియె చాలు;
కన్న మోహంబునకంటె నగ్గలము
ఎన్నఁ బెంచినమోహ మెందు నటండ్రు.
అటుగాన నినుఁ గన్నులారఁ జూచుచును
నిట యుండుటయె నాకు నీప్సితం " బనిన 720
మంద స్మితముభార విందుఁ డై తల్లి
నందంద కౌఁగిట నప్పళింపుచును
'ముల్లోకములకెల్ల ముత్తవ ! నాకుఁ
దల్లివి గాన నాతల్లి : నీయట్టి
తల్లివి గలుగంగఁ దనకు రోగంబు
లెల్లెడఁ బొందఁగ నె ట్లుండవచ్చు ? '
ననుచు నిత్యత్వ మాయమ్మకు నొసఁగె.
ననుపమపరమపరానందమూర్తి
యమ్మ యై శివుఁ గొనియాడుబఁజేసి
యమ్మవ్వ యనునామ మయ్యె. వెండియును-* 730

—: ఉడుమూరి కన్నప్ప కథ^ :—


"శ్రీకాళహస్తిగిరి ప్రదేశమున
శ్రీకంఠభక్తుండు లోకైకనుతుఁడు
ఉడుమూరి కన్నప్పఁ డొక్కనాఁ డర్థి
నడవికి వేఁటమై నరిగి యొక్కెడను
దోడెఱుకులుఁ దాను దోఁపున నుండి
యాడ నొక్కింత నిద్రావస్థ దోఁపఁ
గలయఁగ రుద్రచిహ్నలతోడ నీశుఁ