ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64

బసవపురాణము

నింక భక్తుల కాక యీశ్వరార్చనలు
కొంకక చేయుఁడు గూర్చుండుఁ" డనిన
నుల్లముల్ గలఁగ నొండొరులఁజూచుచును
జల్లన గుండె దిగుల్లన నవయ
భావించి “మన మెట్టు బందిఁ జిక్కితిమి
దేవర గలిగెనా చావు దప్పెడిని
మన కింక నెమ్మయి మగిడిపోఁ బోల"
దని కృతనిశ్చయు లై కూరుచుండి
సరసర మును లింగసహితులపోలెఁ
గరములు సాఁచుడుఁ గట్టుకొంగులను 480
భంగి నాబసవయ్య భావసంగతిని
వంగకాయలు ప్రాణలింగంబులయ్యె .

—: జొన్నలు ముత్తెములైన కథ :—


మఱియును నొక జంగమం బేఁగుదెంచి
యఱిముఱి నభ్యంజనావసరమున
“నిత్యనేమం బిది నేఁటిమ్రుగ్గునకు
ముత్యాలపొడి మాకు [1]ముక్కుస వలయుఁ
గదలక మెదల కీక్షణమాత్రలోనఁ
బదిపుట్లముత్యముల్ బసవ ! యి" మ్మనిన
సరసర లింగవసాయితశస్త్ర
కరతలుఁ డై చూడఁ గనుదృష్టి నున్న 490
జొన్నల ప్రోఁక విశుద్ధము క్తాఫ
లోన్నతరాశి యై యున్న నవ్వుచును
“సన్నుత : పదివుట్లసంఖ్య మీ కేల ?
యెన్ని మీవలసిన వన్ని గైకొనుఁడు."
అనవుఁడు “నట్లకా"కనుచు ముత్యములు
గోనిపోయెఁ [2]బెఱికల దనర నన్నియును.
బసవని దృష్టి సంస్పర్శనంబునన

  1. మూఁడు కుంచములు.
  2. గోనెసంచులు.