ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

బసవపురాణము

గొలఁకు లన్నియు నొప్పుజలజాకరములు ;
కల గోవు లన్నియుఁ గామధేనువులు ;
గోడె లన్నియు నందికుఱ్ఱ : లాపురము
వాడ లన్నియు రంగవల్లివేదికలు ;
నరులెల్ల భక్తులు చిరజీవులెల్లఁ
బరికింపఁ గారణపురుషరూపములు; 1150
స్త్రీలెల్లఁ బరమపతివ్రతామణులు ;
నే లెల్ల నవిముక్తనిధిసమానంబు ;
పలుకు లెల్లను దత్తభాషలు జనుల
యులి వెల్ల గీతవాద్యోత్సవరవము ;
కల్లరి పతితుండు ఖలుఁడు దుర్జనుఁడు
ప్రల్లదుఁ డఱజాతి భక్తిహీనుండు
వికలుండుఁ గొండీఁడు వెదకిన నైన
నొకఁడు మందున కైన నూరిలో లేఁడు ;
అసమానలీల ని ట్లని ప్రస్తుతింప
నెసఁగు కప్పడిసంగమేశ్వరం బందు 1160
సడిసన్న కూడలిసంగమేశ్వరుని
గుడి కేఁగి తన్ను భక్తు లెదుర్కొనంగ
గుడిముందటను నిల్చి గురులింగమూర్తి
యడుగుల కపుడు సాష్టాంగుఁ డై మ్రొక్కి
వేదపురాణార్థవిమలసూక్తులను
నాదంబు పూరించి నలిఁ బ్రసుతింపఁ

—: సంగయదేవుఁడు బసవేశ్వరునకుఁ బ్రత్యక్ష మగుట :—


దొల్లింటివేషంబుతో వచ్చి తేట
తెల్లగా సంగయదేవదేవుండు
గుడివెలిఁ బొడసూప గురులింగమూ ర్తిఁ
బొడఁగని బి ట్టుల్కిపడి బసవండు 1170
పెద్దయుఁ బ్రమదంబు భీతియు భక్తి
దుద్దెక్కి తనలోనఁ దొట్రుకొనంగ