ఈ పుట ఆమోదించబడ్డది

27. తిరుక్కణ్ణమంగై - 27(తిరువారూరు 8 కి.మీ)

(కృష్ణమంగళ క్షేత్రం)

శ్లో. దర్శనాఖ్యసరో రమ్యే కణ్ణ మంగై పురీవరే
   అభిషేక లతాయుక్త: భక్తవత్సల నాయక:||
   ఉత్పలాఖ్య విమానస్థ: సురనాథ దిశాముఖ:
   రోమశర్షి ప్రచేతాభ్యాం సేవిత: కలిజిన్నుత:||

వివ: భక్తవత్సల పెరుమాళ్-అభిషేకవల్లి తాయార్-దర్శన పుష్కరిణీ-ఉత్పల విమానము-తూర్పు ముఖము-నిలుచున్న సేవ-రోమశ మహర్షికిని వరుణునకును ప్రత్యక్షము-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: సన్నిధికి కావలసిన అంశములు ఏడు. అవి విమానము, మండపము, రథము, సరస్సు, క్షేత్రము, నదీ, నగరములు. ఈ ఏడు అంశములు కలిగియుండుటచే ఈ క్షేత్రమునకు సప్తామృతక్షేత్రమని పేరు వచ్చినది. ఈ సన్నిధిలో ఒక తేనెగూడు కలదు. మహర్షులు తేనెటీగల రూపములో స్వామిని ఆరాధించిరట. ఆ తేనె గూటికిని తిరువారాధన జరుగును. "తిరుక్కణ్ణ మంగై యాండాన్" అవతార స్థలము. ఈ క్షేత్రస్వామిని గూర్చి తిరుమంగై యాళ్వార్ "పెఱమ్బుఱుక్కడలై" (పె.తి.10-10) అను దశకమును అనుగ్రహించు చుండగా నాల్గు పాశురములు అనుగ్రహించు సమయమున తిరునిన్ఱవూర్ భక్తవత్సల పెరుమాళ్ ఎదుట సేవ-సాయింపగా "కురుమామణి కున్ఱినై నిన్ఱవూర్ నిన్ఱ నిత్తిల త్తొత్తినై" అని మంగళా శాసనం చేసిరి. ఒక రాత్రి ఇచట నిద్రించినను మోక్షము లభించునని ప్రసిద్ది.

మార్గం: తిరుచ్చేరై నుండి 24 కి.మీ. కుంభఘోణం-తిరువారూర్ బస్ మార్గం తిరువారూర్ నుండి టౌన్ బస్ కలదు. 8 కి.మీ. (కుంభకోణ మార్గం).

పా. పెరుమ్బుఱ క్కడలై యడற்றత్‌తివై ప్పెణ్ణై యాణై; ఎణ్ణిల్ మునివర్‌క్కు
   అరుళ్ తరున్దవత్తై ముత్తిన్ తిరట్కోవైయై ప్పత్తరావియై నిత్తిలత్తొత్తినై
   అరుమ్బినై యలరై యడియేన్ మనత్తాశైయై యుముదమ్బొది యిఇన్జవై
   కురుమ్బినై క్కనియై చెన్ఱునాడి కణ్ణమజ్గయు ట్కణ్డు కొణ్డేన్.

   ఏற்றవై యిమయత్తు ళెమ్మీశనై యిమ్మై యై మఱుమైక్కు మరున్దినై
   ఆற்றలై అణ్డత్తప్పుఱత్తాయ్ త్తిడుమై యనైక్కై యழி యొన్ఱేన్దియ
   కాற்றనై, కురుమామణిక్కున్ఱినై నిన్ఱవూర్ నిన్ఱ నిత్తిల త్తొత్తినై,
   కాற்றనై ప్పునలై చ్చెన్ఱు నాడి క్కణ్ణమజ్గై యుట్కణ్డు కొణ్డేనే.
           తిరుమంగై ఆళ్వార్-పెరియ తిరుమొழி 7-10-1,5

                                    38